చచ్చేంత దేశభక్తి! | Naa Peru Surya Movie Climax Scene Shooting In Process | Sakshi
Sakshi News home page

చచ్చేంత దేశభక్తి!

Published Mon, Feb 12 2018 4:01 AM | Last Updated on Mon, Feb 12 2018 4:01 AM

Naa Peru Surya Movie Climax Scene Shooting In Process  - Sakshi

అల్లు అర్జున్

సైనికుడిగా దేశసేవ చేయాలనుకునేవాళ్లు బోర్డర్‌లో ఉంటారు. దేశం కోసం చచ్చేంత దేశభక్తి ఉన్న సైనికుడు సూర్య మాత్రం బోర్డర్‌ నుంచి రావాల్సి వచ్చిందట. ఎందుకు? అంటే సిల్వర్‌ స్క్రీన్‌పైనే చూడాలి అంటున్నారు ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ చిత్రబృందం. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీషాశ్రీధర్‌ నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాత.

ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో స్టార్ట్‌ చేశారు. సోల్జర్‌ సూర్య పాత్రలో అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. ‘‘క్లైమాక్స్‌ పార్ట్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేశాం. అలాగే వాలెంటెన్స్‌ డే సందర్భంగా సినిమాలోని ‘లవర్‌ ఆల్సో.. ఫైటర్‌ ఆల్సో’ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నాం. రచయిత రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన అద్భుతమైన లిరిక్స్‌కు విశాల్‌–శేఖర్‌ అద్భుతమైన ట్యూన్‌ అందించారు. శేఖర్‌ గొంతుతో ఈ పాట మరింత శ్రావ్యంగా తయారయ్యింది. ఏప్రిల్‌ 27న సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం.’’ అన్నారు నిర్మాతలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement