Lagadapati Shirisha Sridhar
-
‘తెలుగు పరిశ్రమ నుంచి చాలా నేర్చుకోవాలి’
తమిళసినిమా: తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మనం చాలా నేర్చుకోవాలని స్టూడియోగ్రీన్ సంస్థ అధినేత కేఇ.జ్ఞానవేల్‌రాజా వ్యాఖ్యానించారు. అల్లుఅర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య చిత్రం తమిళంలోనూ ఎన్ పేర్ సూర్య పేరుతో విడుదల కానుంది. కే.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా లగడపాటి నిర్మించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 4న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను శక్తి ఫిలిం ఫ్యాక్టరీ అధినేత శక్తివేల్ పొందారు. నటి అనుఇమ్మానుయేల్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో శరత్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. అరుణ్, కవిత, బిమ్మన్, చారుహాసన్, సాయికుమార్, ప్రదీప్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేఇ.జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ మనం తెలుగు పరిశ్రమ నుంచి చాలా నేర్చుకోవాలని అన్నారు. నటీనటుల పారితోషికం, వారి సహకారం వంటి విషయాలను మనం అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. అక్కడ రూ.50కోట్లు పారితోషికం తీసుకునే నటుడు కూడా అడ్వాన్స్‌గా రూ.5 లక్షలే తీసుకుంటారని, దీన్ని మన నటీనటులు కూడా పాటిస్తే బాగుంటుందని ఆన్నారు. ఈ విషయంపై నడిగర్ సంఘం చర్చించి మంచి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. బాలీవుడ్‌కు వెళ్లినా తెలుగు చిత్రపరిశ్రమ గురించే చెప్పుకుంటున్నారని, ఆ పరిశ్రమ అంత సుభిక్షంగా ఉందని, అందుకే తానూ అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించానన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ లారెన్స్ హీరోగా తాను నిర్మించిన లక్ష్యం (తెలుగులో స్టైల్) తమిళ ప్రేక్షకులు ఆదరించారని, మంచి కథా చిత్రాలను ఎప్పుడూ ఆదరించే తమిళ ప్రేక్షకులు ఎన్ పేర్ సూర్య చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇది అల్లుఅర్జున్ కెరీర్లోనే పెద్ద చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు. సమావేశంలో శక్తిఫిలిం ఫ్యాక్టరి శక్తివేల్, రచయిత విజయ్‌బాలాజీ పాల్గొన్నారు. -
బన్నీ యాక్షన్ పార్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది
‘‘మా చిత్రంలోని ‘బ్యూటిఫుల్ లవ్’ అనే పాట నాకు బాగా నచ్చింది. మంచి మెలోడీ. విశాల్ శేఖర్ అన్ని పాటలు చాలా బాగా ఇచ్చారు. సీతారామ శాస్త్రిగారు మంచి సాహిత్యం అందించారు’’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ సినిమాలోని ‘బ్యూటిఫుల్ లవ్’ అంటూ సాగే పాటను నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీషా శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్ యాక్షన్ పార్ట్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగా అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇంకా వారం రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 22న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ చేస్తున్నాం. 29న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్నాం. ‘రంగస్థలం’ అద్భుతమైన హిట్ సాధించింది. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలి. జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘బాహుబలి, ఘాజీ’ టీమ్‌కి కంగ్రాట్స్’’ అన్నారు. ‘‘అల్లు అర్జున్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీ. ‘బ్యూటిఫుల్ లవ్’ సాంగ్ వింటే వాల్ట్ డిస్నీ సాంగ్ విన్నట్టుగా ఉంది. మే 4న మీ ముందుకు వస్తున్నాం. మా చిత్రం అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు శిరీషా శ్రీధర్. అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
మాట నిలబెట్టుకున్న బన్నీ
అల్లు అర్జున్ మాంచి జోరు మీదున్నారు. ‘రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు’.. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్స్ సాధించి, ఈ 23న ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’గా రానున్నారు. అలాగే, కొత్త సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సెట్స్‌లోకి ఎంటర్ కావడానికి రెడీ అయిపోయారు. బుధవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ‘కిక్, రేసుగుర్రం, టెంపర్’ వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తల్లి నిర్మల క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘మేం ‘సై్టల్’ సినిమా తీసిన టైమ్‌లో మాతో ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ మాట ఇచ్చారు. ఆ మాట గుర్తు పెట్టుకొని ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. జులైలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ ముఖ్య పాత్రలో, శరత్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్–శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, సహ నిర్మాత: బన్నీ వాసు.