అతి తక్కువ కాలంలో అత్యంత పాపులర్ అయిన హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. దీంతో పాటు చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఆ పేరే నమ్మ వీట్టు పిళ్లై. వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం తరువాత శివకార్తీకేయన్ గ్రామీణ యువకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది.
నటి అనుఇమాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివకార్తికేయన్‌కు చెల్లెలుగా ఐశ్వర్యరాజేశ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెకు జంటగా నట్టి నటిస్తున్నారు. డీ.ఇమాన్ సంగీతాన్ని, నిరవ్‌షా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో శివకార్తికేయన్ గ్రామీణ పాత్రలో మాస్ గెటప్‌లో కనిపించాడు. ఇక రెండో పోస్టర్‌లో దర్శకుడు పాండిరాజ్ మార్క్ కనిపించేలా చిత్రంలోని పాత్రలన్నింటిని పొందుపరిచి ఒక కుటుంబంలా కనిపించేలా ఉంది.
ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా కార్తీ హీరోగా కడైకుట్టిసింగం వంటి విజయవంతమైన చిత్రం తరువాత పాండిరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం నమ్మ వీట్టు పిళ్లై. చిత్రంపై శివకార్తికేయన్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కాగా తదుపరి శివకార్తికేయన్ హీరో అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇరుంబుతిరై చిత్రం ఫేం పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. అదే విధంగా ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రంతో పాటు విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నారు. దీన్ని లైకా సంస్థ నిర్మించనుంది. వీటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment