
విశాఖపట్నం, గాజువాక: ‘నాకు ఫలానా హీరో అంటే ఇష్టం లాంటి అభిప్రాయాలు లేవు. మంచి కథలు వస్తే ఏ హీరోతోనైనా చేస్తాను. కథే నా ప్రయారిటీ, హీరో’ అన్నారు ప్రముఖ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం గాజువాక విచ్చేసిన ఆమె విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
తెలుగు సినిమాలకే ప్రాధాన్యం
నేను యూఎస్‌లో పుట్టాను. సినిమాల్లోకి వచ్చాక తెలుగుకే అధిక ప్రాధాన్యం ఇచ్చాను. తెలుగులో ఇప్ప టివరకు ఐదు సినిమాలు చేశాను. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కొత్త సినిమాలున్నాయి.
ఆ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి
నానీతో మజ్ను, పవన్ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి, బన్నీ తో నాపేరు సూర్య, గోపీచంద్‌తో ఆక్సిజన్, నాగ చైతన్యతో శైలాజారెడ్డి అల్లుడు చేశాను. ఆ సినిమాలన్నీ మంచి గుర్తింపు తెచ్చాయి. మలయాళంలోనూ ఒక సినిమా చేశాను. నా సినిమాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
విశాఖ పీస్‌ఫుల్ సిటీ
విశాఖ పీస్‌ఫుల్ సిటీ. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. బీచ్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతిసిద్ధమైన అందా లున్నాయి. వైజాగ్ నాలుగుసార్లు వచ్చాను. విశాఖలో ఇప్పటివరకు సినిమా షూటింగ్‌లు చేయకపోయినా షోరూమ్‌ల ఓపెనింగ్‌లకు వచ్చాను. రెండుసార్లు విశాఖ సిటీలోను, రెండుసార్లు గాజు వాకలోను షోరూమ్‌లను ప్రా రంభించేందుకు వచ్చాను. ఈ సిటీ బాగా నచ్చుతుంది.