
అనూ ఇమ్మాన్యుయేల్
‘మజ్ను’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు మలయాళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్. అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గత ఏడాది మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన ‘తుప్పరివాలన్’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారామె. ఆ సినిమా మంచి హిట్ అయింది. తాజాగా కోలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ అనూని వరించిందని సమాచారం. తమిళంలో వరుస హిట్స్‌తో దూసుకెళుతోన్న విజయ్ సేతుపతితో జత కట్టే అవకాశం ఆమె తలుపు తట్టిందట. తన పాత్ర నచ్చడం.. విజయ్ సేతుపతి సినిమాలకు తమిళనాట మంచి క్రేజ్ ఉండటంతో వెంటనే ఓకే చెప్పేశారట అను. తెలుగులో అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.