![Aditi Rao Hydari and Anu Emmanuel joins cast of Maha Samudram - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/20/Anu-Emmanuel-red-dress41.jpg.webp?itok=p9odquUe)
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అదితీ రావ్ హైదరీ ఒక హీరోయిన్‌గా నటించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించింది చిత్రబృందం. యాక్షన్ లవ్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సుంకర రామబ్రహ్మం నిర్మాత. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment