అనూ ఇమ్మాన్యుయేల్‌ కొత్త సినిమా వివరాలివే | Anu Emmanuel Latest Movie Updates | Sakshi
Sakshi News home page

అనూ ఇమ్మాన్యుయేల్‌ కొత్త సినిమా వివరాలివే

Published Thu, Oct 24 2024 12:20 PM | Last Updated on Thu, Oct 24 2024 12:45 PM

Anu Emmanuel Latest Movie Updates

అనూ ఇమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రలో, శివ కందుకూరి మరో లీడ్‌ రోల్‌ ఓ థ్రిల్లింగ్‌ మూవీ తెరకెక్కుతోంది. సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్‌ మూవీ మేకర్స్‌ లిమిటెడ్, మై 3 ఆర్ట్స్‌ పతాకాలపై లండన్‌ గణేష్, డా. ప్రవీణ్‌ రెడ్డి వూట్ల నిర్మిస్తున్న సినిమా ఇది. 

బుధవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, లండన్‌ లొకేషన్స్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని యూనిట్‌ తెలిపింది. ‘‘ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ థ్రిల్లర్‌ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. వైవా హర్ష, వెన్నెల కిశోర్, ఎస్‌. నివాసిని, ‘షకలక’ శంకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement