![Karthi Latest Movie Meiyazhagan Trimmed After feedback from audience](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/30/karthi.jpg.webp?itok=EZqvmR1C)
కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'మెయిజగన్'. ఈ చిత్రాన్ని సత్యం సుందరం పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
(ఇది చదవండి: డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున)
ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 57 నిమిషాలుగా ఉంది. దీంతో నిడివి ఎక్కువ ఉండడంపై పలువురు విమర్శలు చేశారు. హిట్ టాక్ వచ్చినప్పటికీ రన్‌టైమ్‌పై విమర్శలొస్తున్నాయి. అందువల్లే కొన్ని సీన్స్ మేకర్స్ తొలగించినట్లు సమాచారం. దాదాపు 15 నుంచి 18 నిమిషాల వరకు సినిమాను కట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
తాజాగా ట్రిమ్ చేసిన వర్షన్ ఈ రోజు నుంచే థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 40 నిమిషాలుగా ఉంది. కాగా.. ఈ చిత్రంలో శ్రీ దివ్య, రాజ్‌కిరణ్, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీరంజని, ఇళవరసు, కరుణాకరన్ కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment