ఇటీవల విజయాల కోసం ఎదురుచూస్తున్న నటీమణుల్లో కృతిశెట్టి ఒకరు. 2019లో సూపర్ 3డీ అనే హిందీ చిత్రంతో తెరపై మెరిశారు. ఆ తర్వాత ఉప్పెనలా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈమె టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ల లిస్ట్‌లో ఉంటుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలను అందుకున్నారు. అయితే ఆ తర్వాతనే కృతిశెట్టి కెరియర్ అపజయాల బాట పట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఇప్పటివరకు విజయాన్ని చూడలేదన్నది నిజం.
ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో ప్రత్యేక ఫొటో షూట్ నిర్వహించుకొని ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేస్తున్నా, కృతిశెట్టికి తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఎంతో ఆశతో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నాగచైతన్యకు జంటగా నటించిన ద్విభాషా (తెలుగు తమిళ్ ) చిత్రం కస్టడీ ఈమెను పూర్తిగా నిరాశపరిచింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ కృతిశెట్టి పూర్తిగా వదిలేసినా, తమిళ చిత్రపరిశ్రమ మాత్రం ఈమెను ఆదరిస్తుండడం విశేషం.
కస్టడీ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైనా, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అలా కార్తీ సరసన 'వా వాద్దియార్' చిత్రంలోనూ, ప్రదీప్ రంగనాథ్ జంటగా 'ఎల్‌ఐకే' చిత్రంలోనూ, జయంరవి సరసన 'జీనీ' చిత్రంలో కృతిశెట్టి నాయకిగా నటిస్తున్నారు. వీటిలో ఏ ఒక్క చిత్రం సక్సెస్ అయిన ఇక్కడ ఆమెకు రూట్ క్లియర్ అయినట్లే. అందుకే ఆమె ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారు. అయితే మలయాళంలో ఒక చిత్రంలో కృతిశెట్టి నటిస్తున్నారు. ఈమె అక్కడ నటిస్తున్న తొలి చిత్రం ఇదే అన్నది తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment