
తమిళ స్టార్ కార్తీ.. ఈ మధ్యే 'జపాన్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ హిట్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో ఓ దానికి '96' మూవీ ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్. ఈ ప్రాజెక్టుని కార్తీ అన్న, స్టార్ హీరో సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నాడు.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?)
ఇటీవల షూటింగ్ మొదలవగా, శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో ఓ ఏనుగు కీలకపాత్రలో నటిస్తోందట. ఇందుకోసం కేరళ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఓ గజరాజుని ఇక్కడికి రప్పించారట. దీని సంరక్షణ కోసం ఓ వైద్యుడు ఒక మావటితో పాటు ఏకంగా 10 మంది వెంట వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
(ఇదీ చదవండి: కీరవాణి ఇంటి కోడలిగా మురళీ మోహన్ మనవరాలు..)
Comments
Please login to add a commentAdd a comment