తమిళ హీరో కార్తీ మరోసారి పోలీసుగా కనిపించబోతున్నాడు. 'ఖాకీ', 'సర్దార్' సినిమాల్లో పోలీస్‌గా ఆకట్టుకున్న ఇతడు ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ చేయబోతున్నాడు. ఈ మూవీకి 'వా వాతియార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నలన్ కుమార స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ కాగా సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు కీలక పాత్రధారులు.
(ఇదీ చదవండి: నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!: జాన్వీ కపూర్)
కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా కార్తీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోలీసు దుస్తుల్లో కార్తీ, కూలింగ్ కళ్లజోడు, ఆయన వెనక నిలబడ్డ ఎంజీఆర్ పాత్రలతో కూడిన పోస్టర్ ట్రెండీగా ఉంది.
ఇకపోతే కార్తీ ఇంతకుముందు పోలీసుగా చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇది కూడా మంచి విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
(ఇదీ చదవండి: ఫైనల్లీ 'కల్కి' షూటింగ్ పూర్తయింది.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్)
Comments
Please login to add a commentAdd a comment