హిట్ డైరెక్టర్‌తో కార్తీ.. కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ | Karthi New Movie Titled Maiyalagan With Director Prem Kumar | Sakshi
Sakshi News home page

హిట్ డైరెక్టర్‌తో కార్తీ.. కొత్త సినిమాకు క్రేజీ టైటిల్

Published Sun, Jan 21 2024 4:36 PM | Last Updated on Tue, Jan 23 2024 8:32 PM

Karthi New Movie Titled Maiyalagan With Director Prem Kumar - Sakshi

'విరుమాన్‌', 'సర్దార్‌', 'పొన్నియిన్‌ సెల్వన్‌'  సినిమాలతో వరస హిట్లు కొట్టిన కార్తీ.. 'జపాన్'తో ఘోరమైన ప్లాఫ్ తన ఖాతాలో వేసుకున్నాడు.  అయినా సరే దీన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో డైరెక్టర్ నలన్‌ కుమారస్వామి తీస్తున్న మూవీ ఒకటి కాగా.. '96' ఫేమ్‌ ప్రేమ్‌కుమార్‌ దర్శత్వం వహిస్తున్న చిత్రం మరొకటి. 

(ఇదీ చదవండి: ఎక్స్‌పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా)

కార్తీ లేటెస్ట్ మూవీని ఇతడి అన్న సూర్యనే నిర్మిస్తున్నాడు. గతంలో రెండు చిత్రాలు చేశాడు. ఇది హ్యాట్రిక్ మూవీ. ఇకపోతే కార్తీ-ప్రేమ్ కుమార్ కాంబోలో తీస్తున్న సినిమాకు గోవింద్‌ వసంత సంగీతమందిస్తున్నారు. ఇది తంజావూర్ ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు 'దమెయ్యళగన్‌' టైటిల్‌ నిర్ణయించినట్లు సమాచారం. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement