Suriya 43rd Movie Update: Surya Next Movie With Dulquer Salmaan Replaced Karthi, Deets Inside - Sakshi
Sakshi News home page

Surya And Karthi: తమ్ముడిని పక్కన పెట్టిసిన సూర్య.. అసలు ప్లాన్‌ ఇదేనా?

Published Sat, Jul 29 2023 8:45 AM | Last Updated on Sat, Jul 29 2023 9:18 AM

Surya Next Movie With Dulquer Salmaan Replaced Karthi - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం కంగువా. నటి దిశాపటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ జ్ఞానవేల్‌ రాజా, యూవీ క్రియేషన్‌న్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భారీ ఎత్తున 10 భాషల్లో 3డీ ఫార్మెట్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ సగానికి పైగా పూర్తయింది. ఇటీవలే కంగువా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయగా సినీ వర్గాల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కంగువా చిత్రం 2024 సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: వృద్ధుడిపై సీరియల్‌ నటి వలపు వల.. దుస్తులు తొలగించి ఆపై..)

కాగా సూర్య తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్ళకత్వంలో ఈయన మరోసారి నటించనున్నారు. ఈ కాంబోలో ఇంతకుముందు సూరరై పోట్రు (ఆకాశమే నీ హద్దురా) వంటి సూపర్‌ హిట్‌ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ఈ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తాజా సమాచారం. ముందుగా ఇందులో సూర్య, ఆయన సోదరుడు కార్తీ నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ తమ్ముడిని పక్కన పెట్టి దుల్కర్‌ను తీసుకోవాలని సూర్య సూచించారట. దీనికి ప్రధాన కారణం మళయాల పరిశ్రమలో మార్కెట్‌ పెంచుకునేందుకు సూర్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్‌)

అయితే ఇప్పుడు సూర్యతో దుల్కర్‌ సల్మాన్‌ నటించనున్నట్లు తెలిసింది ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందిన చిత్రాన్ని సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌ పతాకంపై నిర్మించనున్నట్లు సమాచారం. ఇది సూర్య నటించే 43వ చిత్రం అవుతుంది. దీనికి జీవి ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని అందించనున్నారు. ఇది ఆయనకు 100 చిత్రం కావడం విశేషం. చిత్ర షూటింగ్‌ డిసెంబర్లో ప్రారంభమవుతుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. దీని తర్వాత సూర్య వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ చిత్రాన్ని చేస్తారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement