
హీరో కార్తీకి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు వరించింది. కథానాయకుడిగా వరుస విజయాలను సాధిస్తున్నాడు హీరో కార్తీ. పరుత్తివీరన్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తొలి చిత్రంతోనే అమోఘ విజయాన్ని, ప్రశంసలను అందుకున్నాడు. గతేడాది విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్ధార్ చిత్రాల్లో నటించి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించాడు. ఉళవన్ ఫౌండేషన్ అనే సేవా సంస్థను ప్రారంభించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలోని వ్యవసాయదారులను ప్రోత్సహించే విధంగా వారికి వెలుగునిచ్చే కార్యక్రమాలను చేపడుతున్నాడు.
వీటన్నింటిని గుర్తించిన ప్రముఖ టీవీ నిర్వాహకులు కార్తీకి మ్యాన్ ఆఫ్ ది ఇయర్–2022 అవార్డును ప్రకటించారు. కాగా నటుడు కార్తీ ప్రస్తుతం విహారయాత్రలో భాగంగా స్పెయిన్ దేశంలో ఉండడంతో ఈ అవార్డును ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆయన తరఫున సర్ధార్ చిత్ర నిర్మాత, కార్తీ స్నేహితుడు లక్ష్మణన్ అందుకున్నాడు. ఈ సందర్భంగా కార్తీ నటనను, ఆయన సేవా కార్యక్రమాలను లక్ష్మణన్ కొనియాడాడు. కార్తీ తరపున ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కార్తీ ప్రస్తుతం జపాన్ చిత్రంలో నటిస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్‌సెల్వన్–2 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.
చదవండి: పఠాన్‌కు ఎంత తీసుకున్నావేంటి? షారుక్ రిప్లై ఏంటో తెలుసా?
నాటు నాటు.. ఆ పాటేంది? ఆ యాసేంది? ట్రోలింగ్‌పై నటి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment