హిట్‌ కాంబో రిపీట్‌ చేస్తున్న కార్తీ | Actor Karthi And Rajkiran Again Sharing Screen In His 26th Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

హిట్‌ కాంబో రిపీట్‌ చేస్తున్న కార్తీ

Published Thu, Aug 24 2023 6:47 AM | Last Updated on Thu, Aug 24 2023 8:56 AM

Karthi And Rajkiran Again Sharing Screen - Sakshi

కోలీవుడ్‌ నటుడు కార్తీ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పొన్నియిన్‌ సెల్వన్‌, సర్దార్‌ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న ఈయన చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాగా నటుడు కార్తీ, రాజ్‌కిరణ్‌ సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌గా ముద్ర వేసుకుంది. ఇంతకు ముందు నటుడు రాజ్‌కిరణ్‌ తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి సమ్మతిస్తారు. అలా ఇంతకు ముందు నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన కొంబన్‌, విరుమాన్‌ వీటిలో విరుమాన్‌ మాత్రమే పసలపూడి వీరబాబు పేరుతో తెలుగులో రిలీజ్‌ అయింది.

ఈ రెండు చిత్రాల్లో రాజ్‌కిరణ్‌ ముఖ్య భూమికను పోషించారు. అంతేకాకుండా ఈ రెండు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. దీంతో కార్తీ తాజాగా నటిస్తున్న చిత్రంలో కూడా రాజ్‌కిరణ్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నారని సమాచారం. కార్తీ హీరోగా నటించిన జపాన్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం కార్తీ దర్శకుడు నలన్‌ కుమారసామి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన నటించే 26వ చిత్రం.

ఇందులో నటి కృతీశెట్టి నాయకిగా నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్‌ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. దీంతో ఆ చిత్రంపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement