rajkiran
-
హిట్ కాంబో రిపీట్ చేస్తున్న కార్తీ
కోలీవుడ్ నటుడు కార్తీ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న ఈయన చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాగా నటుడు కార్తీ, రాజ్‌కిరణ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా ముద్ర వేసుకుంది. ఇంతకు ముందు నటుడు రాజ్‌కిరణ్ తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి సమ్మతిస్తారు. అలా ఇంతకు ముందు నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన కొంబన్, విరుమాన్ వీటిలో విరుమాన్ మాత్రమే పసలపూడి వీరబాబు పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. ఈ రెండు చిత్రాల్లో రాజ్‌కిరణ్ ముఖ్య భూమికను పోషించారు. అంతేకాకుండా ఈ రెండు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. దీంతో కార్తీ తాజాగా నటిస్తున్న చిత్రంలో కూడా రాజ్‌కిరణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారని సమాచారం. కార్తీ హీరోగా నటించిన జపాన్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం కార్తీ దర్శకుడు నలన్ కుమారసామి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన నటించే 26వ చిత్రం. ఇందులో నటి కృతీశెట్టి నాయకిగా నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీంతో ఆ చిత్రంపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. -
డిజిటల్ రుణాల బాటలో బ్యాంకులు
ముంబై: డిజిటల్ రుణాల విధానం బ్యాంకింగ్ ముఖచిత్రాన్ని భారీ స్థాయిలో మార్చేస్తోందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ జి తెలిపారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో రిటైల్, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ)కు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో దాదాపు సగభాగం వాటా డిజిటల్ రుణాల ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఉండగలవని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల వార్షిక సదస్సు సిబాస్ 2021లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు చెప్పారు. డిజిటల్ రుణాల విభాగం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో కస్టమర్లకు ఆన్లైన్లోనే సరీ్వసులు అందించగలిగేలా తగు సాధనాలను బ్యాంకులు రూపొందించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో పెను మార్పులు చోటు చేసుకోగలవన్నారు. మరోవైపు ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) వచి్చన తొలినాళ్లలో అది బ్యాంకింగ్‌కు పోటీగా మారుతుందనే అభిప్రాయాలు ఉండేవని, ప్రస్తుతం రెండూ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని రాయ్ చెప్పారు. ‘ఫిన్‌టెక్‌లు ప్రస్తుతం బ్యాంకులకు సహాయపడుతున్నాయి. అవి మాకు పోటీ కాదు‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు నిరంతరం టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలని, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలని రాయ్ సూచించారు. టెక్నాలజీలో నిపుణులు, కొత్త ఆవిష్కరణలు చేసే ప్రతిభావంతులను నియమించుకోవడం పై ప్రభుత్వ రంగ బ్యాంకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
యూనియన్ బ్యాంకుకు రాజభాష కీర్తి పురస్కారం
న్యూఢిల్లీ: హిందీ భాషను విజయవంతంగా అమలు చేసినందుకు 2018–19, 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ‘రాజభాష కీర్తి పురస్కార్’ను దక్కించుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనలైజ్డ్ బ్యాంకు విభాగంలో.. 2019–20లో మొదటి బహుమతిని, 2020–21 లో తృతీయ బహుమతిని అందుకుంది. హౌస్ మేగజైన్ విభాగంలో 2018–19లో.. సంస్థ అంతర్గత మేగజైన్ ‘యూనియన్ శ్రీజన్’కు రెండో బహుమతి లభించింది. ఇలా అధికారిక భాష అమలులో 5 అవార్డులను దక్కించుకున్నట్టు యూనియన్ బ్యాంకు ప్రకటించింది. -
పాటతో సండైకోళి –2 ప్రారంభం
తమిళసినిమా: సండైకోళి–2 చిత్రానికి బుధవారం శ్రీకారం చుట్టారు. చాలాకాలంగా ఈ చిత్రంపై పలు రకాల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు చిత్ర షూటింగ్ సాంగ్‌తో బుధవారం ప్రారంభమైంది. విశాల్, దర్శకుడు లింగుస్వామిలది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరి కలయికలో 2005లో వచ్చిన సండైకోళి చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటు, విశాల్‌కు మాస్ హీరో ఇమేజ్ కట్టబెట్టిన చిత్రంగా నమోదైంది.ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న చిత్రమే సండైకోళి–2. మొదటి భాగంలో నటించిన నటుడు రాజ్‌కిరణ్ ఈ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇక హీరోయిన్లుగా త్రిష, కీర్తీసురేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. శక్తి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం కోసం చెన్నైలోని బిన్ని మిల్లులో మదురై ఉత్సవాలను తలపించే విధంగా భారీ సెట్‌ను వేశారు. ఆ సెట్లో విశాల్, కీర్తీసురేశ్ పాటతో చిత్రీకరణను ప్రారంభించారు. సండైకోళి చిత్రం తరువాత విశాల్, లింగుసామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సండైకోళి–2 చిత్రంపై కచ్చితంగా భారీ అంచనాలు నెలకొంటాయని వేరే చెప్పాలా? ఈ చిత్రాన్ని విశాల్ తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. -
మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నయన
తమిళసినిమా: నటి నయనతార మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. మాయ చిత్రంతో నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్న నటి నయనతార. అప్పటి వరకూ కమర్శియల్ చిత్రాల నాయకిగా రాణించిన ఈ సంచలన నటి మాయ చిత్రంతో చిత్ర కథను తన భుజాన వేసుకుని విజయ తీరానికి చేర్చే స్థాయికి చేరారు. ఆ తరువాత నటించిన డోరా చిత్రం నిరాశపరచినా, నయనతారకు దాని ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదు. ప్రేమ వివాదాల్లో ఒడుదుడుకులను ఎలాగైతే వాటిని అధిగమించారో, నటిగానూ అపజయాలను దాటి విజయాల బాట పట్టారు. ప్రస్తుతం అరమ్, కొలైయుధీర్ కాలం, ఇమైకా నోడిగళ్, నేర్‌వళి వంటి హీరోయిన్ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు మరోపక్క హీరోలతో కమర్షియల్ చిత్రాలను నటిస్తూ తెగ బిజీగా ఉన్నారు. ఈ శుక్రవారం శివకార్తికేయన్‌తో జత కట్టిన వేలైక్కారన్ చిత్రం విడుదల కావలసి ఉన్నా, నిర్మాణ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో ఆ చిత్రం వెనక్కు వెళ్లింది. అయితే త్వరలో ఇమైకా నోడిగళ్, ఆరమ్ చిత్రాలు తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఇకపోతే తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న నయనతార తాజాగా మరో హీరోయిన్ సెంట్రిక్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. కుట్రం 23 వంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన అరివళగన్ దర్శకత్వంలో నయనతార నటించనున్నారన్నది తాజా సమాచారం. ఇందులో సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రను పోషించనున్నారట. ఈ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిసింది. అయితే చిత్ర వివరాలను త్వరలోనే అధికారికపూర్వకంగా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
మెగాఫోన్ పట్టనున్న ధనుష్?
చాలా మంది ఒక వృత్తిలో రాణించడానికే పడరాని అవస్థలు పడుతుంటారు. అలాంటిది నటన, గీతరచయిత, గాయకుడు, నిర్మాత ఇలా పలు శాఖల్లో రాణించి శభాష్ అనిపించుకోవడం సాధారణ విషయం కాదు. అలాంటి అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలిల పట్టికలో నటుడు ధనుష్‌ను చేర్చవచ్చు. అసలు నటుడిగానే పనికిరాడు అని ఎగతాళికి గురైన నటుడు ధనుష్. తుళువదో ఇళమై చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ధనుష్‌ను ఆ చిత్రం విడుదల తరువాత ఇలాంటి వాళ్లంతా హీరోగా నిలబడతారా? అని పరిహాసం ఆడినవారు లేకపోలేదు. అయితే తొలి చిత్రంతోనే సంచలన విజ యం సాధించి ఆ తరువాత నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. రాంజానా, షమితాబ్ చిత్రాలతో బాలీవుడ్‌లోనూ సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆడుగళం చిత్రంతో నటుడిగా జాతీయ అవార్డును, కాక్కాముట్టై చిత్రంతో నిర్మాతగా జాతీయ అవార్డును అందుకున్న ధనుష్ వై దిస్ కొలవెరి డీ పాటతో గాయకుడిగా, గీత రచయితగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఇలా నటుడిగా గాయకుడిగా, గీతరచయితగా, నిర్మాతగా విజయపథంలో పయనిస్తున్న ధనుష్ తాజాగా మరో అవతారం ఎత్తనున్నారన్న ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అదే దర్శకుడి అవతారం. ధనుష్‌లో దర్శకత్వం వహించాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. అది దాన్ని ఇప్పుడు నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ధనుష్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటుడు రాజ్‌కిరణ్ ప్రధాన పాత్ర పోషించనున్నారని, ఇతర నట వర్గం, సాంకేతిక బృందం ఎంపిక జరుగుతోందని ప్ర చారం జరుగుతోంది. అయితే ఇందులో ధనుష్ నటిస్తారా? లేదా?అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈయన గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రంలో నటిస్తున్నారు. -
త్రిపురకు అతనే హీరో - దాసరి
‘‘నాకు రాజమౌళి, శేఖర్ కమ్ముల, క్రిష్ సినిమాలంటే చాలా ఇష్టం. దర్శకుడనే పదానికి నిజమైన అర్థం తీసుకొచ్చారు. వారిలో రాజకిరణ్ కూడా ఉన్నారు. ఈ చిత్రానికి అతనే హీరో. రాజకిరణ్ రూపొందించిన ‘గీతాంజలి’ చూశాను. స్వాతి కళ్లు చాలా డేంజరస్. ఈ చిత్రానికి సరిగ్గా సూట్ అవుతాయి. విపరీతమైన పోటీ ఉన్న ఈ కాలంలో నవీన్ చంద్ర చాలా కష్టపడి నిలదొక్కుకుంటున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. స్వాతి, నవీన్‌చంద్ర ముఖ్యపాత్రల్లో రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ‘త్రిపుర’ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కమ్రాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దాసరి ఆవిష్కరించారు. క్రిష్ మాట్లాడుతూ-‘‘నాకు దెయ్యాల సినిమాలంటే చాలా భయం. ‘అరుంధతి’ సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడే నేను సీట్లో కాళ్లు పెట్టుకుని మరీ చూశాను. ‘గీతాంజలి’ సినిమా చూస్తున్నప్పుడు పడీ పడీ నవ్వాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘రాజకిరణ్ నాకు ‘గీతాంజలి’ కథ చెప్పినప్పుడు ‘త్రిపుర’ అనే టైటిల్ చెప్పారు. తర్వాత ఈ సినిమా కథను చెప్పి ‘త్రిపుర’ టైటిల్ చెప్పారు. ఇది అతనికి బ్రహ్మాస్త్రం లాంటి కథ. తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ‘‘రాజకిరణ్ ఎంత చక్కగా కథ చెప్పారో, అంత కన్నా బాగా తెరపై ఆవిష్కరించారు. కమ్రాన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని స్వాతి చెప్పారు. రాజకిరణ్, రచ యిత వెలిగొండ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ మల్లాల తదితరులు పాల్గొన్నారు. -
త్రిపుర టీజర్ లాంచ్ చేసిన చిత్రయూనిట్
-
అతడి కోసం రూ.2 కోట్ల అదనపు ఖర్చు!
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. ఆయన తమ సినిమాలో నటించాలని కోరుకుని హీరోలు అరుదు. హీరో రామ్‌చరణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రకాశ్‌రాజ్ కోసం అదనంగా రూ. 2 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు చెర్రీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. చరణ్ తాజాగా నటించిన 'గోవిందు అందరివాడేలే'లో తాత పాత్రకు ముందుగా రాజ్‌కిరణ్ ను తీసుకున్నారు. చిత్రీకరణ్ సమయంలో సంతృప్తి కలగకపోవడంతో రాజ్‌కిరణ్ ను తీసేసి ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నారు. ఇందుకోసం రూ. 2 కోట్లు అదనంగా ఖర్చయిందని చరణ్ వెల్లడించాడు. అయితే రూ. పదికోట్లకు సమానంగా ప్రయోజనం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. చెర్రీ నమ్మకం నిజమవుతుందో, లేదో ప్రేక్షకులే తేల్చాలి. -
‘గీతాంజిలి’కి సీక్వెల్ తీస్తా..
స్టోరీ, డెరైక్టర్ రాజ్‌కిరణ్ రూ.4కోట్లు ఖర్చు పెట్టాం.. రూ.12కోట్లు సంపాదించాం.. కథను శ్మశానంలో కూర్చుని రాశా.. అమలాపాల్, స్వాతి చెయ్యనంటేనే.. అంజలిని ఎంచుకున్నాం.. ఘన విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.. ఘనవిజయం సాధించిన హర్రర్, కామెడీ చిత్రం గీతాంజలికి తర్వలో సీక్వెల్ తీస్తానని రాజ్‌కిరణ్ చెప్పారు. తనను సినీ రంగానికి పరిచయం చేసిన ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)ను గురువారం ఆయన ఆటపాకలోని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి బాబు దర్శకుడు రాజ్‌కిరణ్‌కు స్వీటు తినిపించి అభినందించారు. అనంతరం రాజ్‌కిరణ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందిన గీతాంజలి సినిమా నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికి రూ.12 కోట్లు వసూలు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తాను చూసిన ఓ యదార్థ సంఘటనను గీతాంజలి సీక్వెల్-2గా తెరకెక్కించనున్నట్లు రాజ్‌కిరణ్ తెలిపారు. గీతాంజిలి కథను ఓ శ్మశానంలో కూర్చుని రాశానని చెప్పారు. మొదట్లో టూలెట్, తర్వాత బాలాత్రిపురసుందరి పేర్లు అను కున్నామని, చివరికి అంజలి కథనాయిక కావడంతో గీతాంజలిగా మార్చామని తెలిపారు. తొలుత సినిమా హీరోయిన్గా అమలాపాల్, కలర్ స్వాతిలను అడిగితే, వారు శ్రీనివాసరెడ్డితో నటించడానికి సుముఖత చూపలేదన్నారు. నిర్మాత కోన వెంకట్ తనకెంతో సహాయం చేశారన్నారు. తాటికాయంత టాలెంట్‌కు ఆవగింజంత అదృష్టం ఉండాలి గీతాంజలి సినిమాలో చెప్పినట్టుగా ‘తాటికాయంత టాలెంట్‌కు ఆవగింజంత అదృష్టం ఉండాలి..’ అని రాజ్‌కిరణ్ చెప్పారు. స్థానిక డిగ్రీ కాలేజీ, విద్యాంజజి జూనియర్ కాలేజీ విద్యార్థులతో గురువారం ఆయన ముచ్చటించారు. తాను ఇదే ఊరిలో బాలాజీగా వినాయక స్డూడియోను నడిపానని, సినిమాలపై మోజుతో వెంకటరమణ థియేటర్ ప్రొజక్టర్ ఆపరేటర్ దగ్గర పనిచేశానన్నారు. కొద్దికాలం బాలాజీ మ్యూజికల్స్ నైట్స్ పేరుతో కచేరీలు కూడా చేశానని ఆయన వివరించారు. -
కైకలూరు కుర్రాడు
‘గీతాంజలి’ సినిమాకు కథా రచయిత, దర్శకత్వ బాధ్యతలు ఫొటోగ్రాఫర్ నుంచి సినీ దర్శకుడిగా ఎదిగి.. త్వరలో మరో మూడు సినిమాలు కైకలూరుకు చెందిన రాజ్‌కిరణ్ విజయ గాథ రెడీ.. వన్.. టు.. త్రీ.. యూక్షన్.. ఒకనాడు కైకలూరు రహదారులపై కెమేరాలు పట్టుకుని ప్రోగ్రామ్‌ల కోసం తిరిగిన ఓ కుర్రాడు.. నేడు సినీ పరిశ్రమలో ప్రతిభ గల దర్శకుడిగా మారాడు. ఒకప్పుడు పేదరికంతో కుటుంబ భారాన్ని మోసిన ఆ యువకుడు.. ‘విశ్రాంతి’ లేకుండా పనిచేసి ఇప్పుడు ఎంతోమంది సినీ దిగ్గజాలతో సరికొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ప్రతిభనే పబ్లిసిటీగా.. ఆలోచనలనే కథలుగా మలిచి ‘గీతాంజలి’గా మన ముందుకు రాబో తున్నాడు. దర్శకుడిగా ఎన్ని టేక్‌లు చెప్పినా.. నిజ జీవితంలో వెనుదిరిగి చూడకుండా ‘శుభం’ కార్డు వేయించుకున్నాడు. మరి ఆ కైకలూరు కుర్రాడి కథమిటో చదవండి... కైకలూరు : తండ్రి ఓ సాధారణ మెకానిక్. కుటుంబపోషణ అంతంత మాత్రం. ఓపక్క చదువు, మరోపక్క ఇంటి బాధ్యతలు. ఏం చేయలేని పరిస్థితిలో ఫొటోగ్రాఫర్‌గా మారాడు కైకలూరుకు చెందిన పిల్లి బాలాజీ. తల్లిదండ్రులు మెహినీప్రసాద్, చంద్రకాంతం. ఓ తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద కుటుంబం కావడంతో చిన్న వయసులోనే బాధ్యతలు చుట్టుముట్టాయి. దీంతో కైకలూరులో పదిహేనేళ్ల కిందట బాలాజీ మ్యూజికల్ నైట్స్ స్థాపించాడు. ఊరూరా తిరుగుతూ వచ్చిన కొద్దిపాటి మొత్తంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొద్దికాలానికే ఆ ఉపాధి కూడా కరువైంది. చేసేదేమీలేక పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు. రాజ్కిరణ్గా పేరు మార్చుకుని సినిమా కథా రచయిత, దర్శకుడిగా మారి తన ప్రతిభ చాటుతున్నాడు. అంతేకాదు.. కైకలూరులో సాయిబాబా మందిరాన్ని ఏర్పాటుచేసి సొంత ఊరుపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. సహనంతోనే ఏదైనా సాధించగలం.. చిన్నతనం నుంచి అనేక కష్టాలు అనుభవించాను. రోజు ఎలా గడుస్తుందా అనే పరిస్థితి మాది. సినిమాలంటే ప్రాణం. మక్కికిమక్కీగా పాటలు పడేవాడ్ని. భీమవరం కేజీఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు హాస్యనటుడు ఎంఎస్ నారాయణ పరిచయమయ్యారు. సినిమాలకు వస్తానంటే ఇప్పుడు వద్దన్నారు. అయినా కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయూను. ఎంఎస్ నారాయణ తిరిగి వెళ్లిపోమన్నారు. పట్టు విడవకుండా పదేళ్లు కష్టపడ్డాను. వీఆర్ ప్రతాప్, రాజా వన్నెంరెడ్డి, రవిరాజా పినిశెట్టి వంటి దర్శకుల వద్ద పనిచేశాను. 2004లో ఉషాకిరణ్ మూవీస్‌కు పనిచేసే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) నన్ను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. గీతాంజలి కథలో భయంతో పాటు హాస్యం కూడా ఉంటుంది. మరో మూడు సినిమాలకు అవకాశం వచ్చింది. కైకలూరు ప్రజలను ఎప్పటికీ మరిచిపోలేను. సహనంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చనడానికి నా కథే ఉదాహరణ. - రాజ్‌కిరణ్ ‘గీతాంజలి’ సినిమాకు కథా రచయిత, దర్శకుడిగా.. ఎంవీవీ సినిమా బ్యానర్‌పై ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం అంజలి ప్రధాన పాత్రలో, హర్రర్, కామెడీనే ఇతివృత్తంగా రాజ్‌కిరణ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘గీతాంజలి’. ఈ సినిమాకు ఆయనే కథ అందించారు. ప్రముఖ రచయిత, దర్శకుడు కోన వెంకట్ సమర్పణలో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు. బ్రహ్మానందం, హర్షవర్ధన్ రాణే, శ్రీనివాసరెడ్డి, రావు రమేష్, సత్యం రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఆడియో ఫంక్షన్ జరుపుకొన్న ఈ చిత్రం ఆగస్టు మొదటి వారంలో విడుదల కానుంది. -
ఊహకు అందని రీతిలో...
అందమైన అమ్మాయితో స్నేహం ఏ కుర్రాడికైనా ఆనందమే. అదే ఆ కుర్రాడు సినీ దర్శకుడైతే... కొత్త కొత్త కథలు పుడుతుంటాయి. సినిమా దర్శకునిగా ఎదగాలనుకుంటున్న ఓ కుర్రాడి రూమ్‌కి ఓ అమ్మాయి వచ్చి పోతుంటుంది. ఆ అమ్మాయి రాక, అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ ‘గీతాంజలి’. అంజలి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు రాజకిరణ్ చెబుతూ -‘‘ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని ప్రయత్నమిది. అంజలి పాత్ర చిత్రణ ఊహలకు అందని రీతిలో ఉంటుంది. వినోదంతో పాటు ఉత్కంఠకు లోనుచేసేలా ఈ సినిమా ఉంటుంది. వచ్చే నెల 3, 6, 7 తేదీల్లో బ్రహ్మానందంపై చిత్రీకరించే సన్నివేశాలతో టాకీ పూర్తవుతుంది. అదే నెల 9 నుంచి మూడు రోజుల పాటు అంజలి, హర్షవర్దన్ రాణేలపై చిత్రీకరించే మాంటేజస్ సాంగ్‌తో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. అదే నెలలో పాటలను, జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రావురమేశ్, మధునందన్, షకలక శంకర్, సత్యం రాజేశ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఉపేంద్ర, కెమెరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్.