యూనియన్‌ బ్యాంకుకు రాజభాష కీర్తి పురస్కారం | Union Bank of India bags Rajbhasha Kirti Puraskar | Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంకుకు రాజభాష కీర్తి పురస్కారం

Published Thu, Sep 16 2021 4:06 AM | Last Updated on Thu, Sep 16 2021 4:06 AM

Union Bank of India bags Rajbhasha Kirti Puraskar - Sakshi

న్యూఢిల్లీ: హిందీ భాషను విజయవంతంగా అమలు చేసినందుకు 2018–19, 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ‘రాజభాష కీర్తి పురస్కార్‌’ను దక్కించుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌ రాయ్‌ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనలైజ్డ్‌ బ్యాంకు విభాగంలో.. 2019–20లో మొదటి బహుమతిని, 2020–21 లో తృతీయ బహుమతిని అందుకుంది. హౌస్‌ మేగజైన్‌ విభాగంలో 2018–19లో.. సంస్థ అంతర్గత మేగజైన్‌ ‘యూనియన్‌ శ్రీజన్‌’కు రెండో బహుమతి లభించింది. ఇలా అధికారిక భాష అమలులో 5 అవార్డులను దక్కించుకున్నట్టు యూనియన్‌ బ్యాంకు ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement