Rajbhasha Kirti Puraskar
-
యూనియన్ బ్యాంకుకు రాజభాష కీర్తి పురస్కారం
న్యూఢిల్లీ: హిందీ భాషను విజయవంతంగా అమలు చేసినందుకు 2018–19, 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ‘రాజభాష కీర్తి పురస్కార్’ను దక్కించుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనలైజ్డ్ బ్యాంకు విభాగంలో.. 2019–20లో మొదటి బహుమతిని, 2020–21 లో తృతీయ బహుమతిని అందుకుంది. హౌస్ మేగజైన్ విభాగంలో 2018–19లో.. సంస్థ అంతర్గత మేగజైన్ ‘యూనియన్ శ్రీజన్’కు రెండో బహుమతి లభించింది. ఇలా అధికారిక భాష అమలులో 5 అవార్డులను దక్కించుకున్నట్టు యూనియన్ బ్యాంకు ప్రకటించింది. -
మాజీ ప్రధానుల పేర్లు తొలగించిన ఎన్డీఏ
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తనముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేరుతో కొనసాగుతున్న రెండు అవార్డులకు పేర్లు మార్చింది. ఇందిర, రాజీవ్ పేర్లను తొలగించి కొత్త పేర్లు పెట్టింది. హిందీ భాష ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఇందిరా గాంధీ రాజభాష పురస్కార్, రాజీవ్ గాంధీ రాష్ట్రీయ- విజ్ఞాన్ మౌలిక్ పుస్తక్ లేఖన్ పురస్కార్ పేర్లను మార్చినట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. రాజభాష కీర్తి పురస్కార్, రాజభాష గౌరవ్ పురస్కార్ గా నామకరణం చేసినట్టు వెల్లడించింది. అయితే అవార్డుల పేర్ల మార్పు వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.