Actress Jyothika was hit with a string in a saree, video goes viral - Sakshi
Sakshi News home page

Actress Jyothika: సూర్య భార్య జ్యోతికలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! స్టేజ్‌పై ఆ స్టంట్‌ వేసి షాకిచ్చిన నటి

Published Sat, Feb 25 2023 11:11 AM | Last Updated on Sat, Feb 25 2023 11:40 AM

Suriya Wife Jyothika Was Hit With a String in a Saree Video Goes Viral - Sakshi

నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్‌ నటి నగ్మా చెల్లెలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్‌గా కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉండగానే తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చి గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లైయింది.

చదవండి: అంబర్‌ పేట్‌ ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్‌, ఆమె రియాక్షన్‌ చూశారా?

కొంతకాలంగా 2డీ ప్రొడక్షన్‌పై భర్త సూర్యతో కలిసి జ్యోతిక నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో ఆమె అడపదడపా చిత్రాలు చేస్తూ సినిమాల్లోకి రీఎంట్రి ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాతగా, నటిగా రాణిస్తోంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జ్యోతిక పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో జ్యోతిక చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా జ్యోతిక తన స్కిల్స్‌తో అందరి చేత ప్రశంసలు అందుకుంది. కొందరు హీరోలకి కూడా సాధ్యం కాని ఓ స్టంట్‌ చేసి వావ్‌ అనిపించుకుంటోంది. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన జేఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్‌ ఫంక్షన్‌కు జ్యోతిక హాజరైంది.

చదవండి: పెద్దగా ఆఫర్స్‌ లేవు.. అయినా ఆ స్టార్‌ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి

ఈ సందర్భంగా సాంప్రదాయ చీరకట్టులో వచ్చిన జ్యోతిక తన స్కిల్‌తో అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. స్టేజ్‌పై అవార్డు అందుకున్న అనంతరం చీరలోనే కర్రసాము చేసి షాకిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హోమ్లీగా కనిపించే జ్యోతికలో ఇంతటి టాలెంట్‌ ఉందా! అంటూ నెటిజన్లు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement