
నటుడు సూర్య మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఇంతకుముందు పేరళగన్, వారణం ఆయిరం, వేల్, మాట్రాన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇక 24 చిత్రంలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. తాజాగా సంచలన దర్శకుడు బాల చిత్రంలో కథానాయకుడిగా డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇందులో రెండు పాత్రల్లో ఒకటి బదిర (మూగ, చెవుడు) పాత్ర అని సమాచారం. సుమారు 16 ఏళ్ల తర్వాత జ్యోతిక భర్త సూర్యతో కలిసి ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.
మరో కథానాయిక పాత్రను టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నారు. టూడి వెంకట్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. సూర్యకు తొలి రోజుల్లో నంద, ఆ తర్వాత పితామగన్ చిత్రంతో మరో సంచలనం విజయాన్ని అందించిన బాల తాజాగా నిర్మించనున్న ఈ చిత్రంపై ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment