duel role
-
16 ఏళ్ల తర్వాత.. భర్తతో కలిసి నటిస్తున్న జ్యోతిక
నటుడు సూర్య మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఇంతకుముందు పేరళగన్, వారణం ఆయిరం, వేల్, మాట్రాన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇక 24 చిత్రంలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. తాజాగా సంచలన దర్శకుడు బాల చిత్రంలో కథానాయకుడిగా డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఇందులో రెండు పాత్రల్లో ఒకటి బదిర (మూగ, చెవుడు) పాత్ర అని సమాచారం. సుమారు 16 ఏళ్ల తర్వాత జ్యోతిక భర్త సూర్యతో కలిసి ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. మరో కథానాయిక పాత్రను టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నారు. టూడి వెంకట్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. సూర్యకు తొలి రోజుల్లో నంద, ఆ తర్వాత పితామగన్ చిత్రంతో మరో సంచలనం విజయాన్ని అందించిన బాల తాజాగా నిర్మించనున్న ఈ చిత్రంపై ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
సాహో.. డ్యూయల్ కాదు సింగిలే..!
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఎక్కువగా బాలీవుడ్ నటులే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండటం కూడా సినిమా మీద అంచనాలు మరింత పెంచుతోంది. ముఖ్యంగా హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ధాకపూర్ క్యారెక్టర్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా శ్రద్ధా డ్యూయల్ రోల్ లో నటిస్తుందని అందులో ఒకటి నెగెటివ్ క్యారెక్టర్ అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చింది శ్రద్ధా. సాహో సినిమాలో తాను ఒక్క పాత్రే చేస్తున్నట్టుగా చెప్పిన శ్రద్ధా పాత్రలోనే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలపింది. అంతేకాదు ఈ సినిమాలో తాను యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చింది.