జ్యోతిక
పట్టు పట్టారు అని వింటుంటాం కానీ పట్టు పెట్టారు ఏంటీ అనుకుంటున్నారా? అవును.. జ్యోతిక పట్టు పెట్టారు. ఎవరికీ అంటే ‘కాట్రిన్ మొళి’ చిత్రబృందానికి. విద్యా బాలన్ బాలీవుడ్ చిత్రం ‘తుమ్హారీ సులూ’ తమిళ రీమేక్ ‘కాట్రిన్ మొళి’లో నటిస్తున్నారు జ్యోతిక. రాధామోహన్ దర్శకత్వంలో జి. ధనుంజయ్ నిర్మిస్తున్నారు. ఇందులో మంచు లక్ష్మీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శింబు గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్‌ను జ్యోతిక ఇటీవలే కంప్లీట్ చేశారు. షూటింగ్ చివరి రోజున టీమ్ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు జ్యోతిక. ఈ సినిమాకు పని చేసిన టీమ్ మెంబర్స్ అందరికీ పట్టు పంచె, పట్టు ధోతి, షర్ట్స్, పట్టు చీరలని పంచి పెట్టారు. సడెన్‌గా ఇలా గిఫ్ట్స్ ఇవ్వడంతో టీమ్ అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జ్యోతికను అభినందించకుండా ఉండలేకపోయారు.
పవర్‌ఫుల్ ఝాన్సీ
బాలా దర్శకత్వంలో జ్యోతిక ముఖ్య పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘నాచియార్’. ‘ఝాన్సీ’ టైటిల్‌తో తెలుగులోకి అనువాదం అయింది. కోనేరు కల్పన, డి. అభిరాం అజయ్ కుమార్ సంయుక్తంగా ఆగస్ట్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు కల్పన మాట్లాడుతూ – ‘‘తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. బాలా దర్శకత్వం, జ్యోతిక నటన సినిమాకు హైలైట్స్. ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment