
జ్యోతిక, రాధిక శరత్ కుమార్
నటి జ్యోతికను సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ అభినందించారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పొన్మగల్ వందాల్. దర్శకుడు కే. భాగ్యరాజ్, పార్దిబన్, పాండ్య రాజ్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని 2–డీ ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్య నిర్మించారు. ఈ చిత్రం విడుదలకు ముస్తాబైంది. అయితే లాక్ డౌన్ కారణంగా విడుదలలో జాప్యం జరిగింది. దీంతో నిర్మాత సూర్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ద్వారా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. చదవండి: జగన్ గారికి ధన్యవాదాలు
ఈ మేరకు పొన్మగల్ వందాల్ చిత్రం ఈ నెల 29న అమెజాన్ ప్రైమ్ టైమ్ లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆన్‌లైన్ లో మీడియా ప్రతినిధులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. జ్యోతిక భేటీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో స్పష్టమైన తమిళ భాషను మాట్లాడిన జ్యోతికకు నటి రాధిక శరత్ కుమార్ అభినందనలు తెలిపారు. ఆమె తన ట్విట్టర్ లో పేర్కొంటూ ఆత్మవిశ్వాసంతో చాలా స్పష్టంగా తమిళంలో మాట్లాడటాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తను ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం అవుతోందని అన్నారు. ఉత్తరాది నుంచి వచ్చి అంత అంకిత భావంతో పని చేస్తున్న ఏకైక నటి జ్యోతిక అని రాధికా శరత్ కుమార్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment