ఫిట్‌నెస్ మెంటైన్ చేసే విషయంలో కొందరు హీరోయిన్లు తోపు ఉంటారు. ఎందుకంటే మంచి వయసులో ఉన్న చాలామందికి సాధ్యం కానివి చేసి చూపిస్తుంటారు. ఇక వర్కౌట్ లాంటి వాటితో బాడీని మంచి షేప్‌లో ఉంచుతుంటారు. ఇలాంటి బ్యూటీస్‌లో హీరోయిన్ జ్యోతిక ఒకరు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన మూవీస్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏ హీరోయిన్‌కి సాధ్యం కానిది చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)
ముంబయికి చెందిన జ్యోతిక.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. హీరో సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత నటన పక్కనపెట్టేసింది. పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్‌గా మంచి దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్న జ్యోతిక.. ఫిట్‌నెస్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. మొన్నీమధ్య భర్త సూర్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంది.
ఇకపోతే గతంలో హిమాలయాలు, కశ్మీర్‌లో ట్రెక్కింగ్ చేస్తూ కనిపించిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే బిజీలో ఉంది. ప్రస్తుతం బేస్ క్యాంప్ వరకు వెళ్లిన విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్కడివరకు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాను. ఏమేం తిన్నాను. అక్కడ వాతావరణం ఎలా ఉంది లాంటి విజువల్స్‌ని రీల్ చేసి పోస్ట్ చేసింది. ఒకవేళ జ్యోతిక గనుక ఎవరెస్ట్ ఎక్కితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ అయిపోతుంది!
(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక)
Comments
Please login to add a commentAdd a comment