everest base camp
-
‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!
పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే స్త్రీ జీవనం గడిచిపోతుంది. రొటీన్లో తన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంటుంది. జీవనశైలిని మార్పుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాస్టెస్ట్ ఔతాహ్సిక మారథానర్గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి.50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తిచేసి స్టార్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ మారథాన్ ల చరిత్రలో అత్యంత వేగవంతమైన భారతీయ మహిళా రన్నర్‌గా నిలిచారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి ‘మన మైండ్, బాడీ చురుగ్గా ఉండాలంటే ముందు ఏదైనా క్రీడలలో పాల్గొనాలి’ అంటూ ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.‘‘మన దేశంలో మహిళలు బయటకు వచ్చి, రన్స్‌లో పాల్గొడం తక్కువే. వారిని ఎంకరేజ్ చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. పుట్టి పెరిగింది అనంతపూర్. డిగ్రీ పూర్తవుతూనే పెళ్లి, కుటుంబ బాధ్యతలు. ఎప్పుడూ క్రీడల్లో పాల్గొనలేదు. నలభైఏళ్ల వరకు గృహిణిగా, ఇద్దరు అబ్బాయిల పెంపకం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వచ్చాను. వయసు పెరుగుతున్నప్పుడు జీవనశైలి సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, కొన్ని మార్పులు చేసుకోవాలనుకుని, పదేళ్ళక్రితం జిమ్‌లో చేరాను. కొన్నిరోజులు ఇబ్బందే అనిపించింది. కానీ, అదే సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. స్నేహితుల ద్వారా మారథాన్ల గురించి తెలిసింది. అలా జిమ్‌తో పాటు పదేళ్ల క్రితమే మారథాన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. మా వారు దీపక్‌రెడ్డి ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్, పుణెలలో నివసిస్తూ వచ్చాం. అలాగే, ఎక్కడ మారథాన్ జరిగినా పాల్గొంటూ వచ్చాను. మారథాన్లు నా జీవన విధానాన్నే మార్చాయి. వాటిల్లో ఎంజాయ్ చేయడమే పెరిగింది. దీంతో అదే ΄్యాషన్గా మారింది.సొంత గుర్తింపుకూతురు, భార్య, తల్లి.. సమాజం మనకో గుర్తింపునిస్తుంది. కానీ, మనకంటూ ఓ సొంత గుర్తింపును సాధించుకోవాలి. అందుకు ఏదో ఒక యాక్టివిటీని ఏర్పరుచుకోవాలి. గృహిణిగా, అమ్మగా గుర్తింపు ఉన్న నాకు ఇప్పుడు ‘మారథాన్ రన్నర్ కవితారెడ్డి’ అంటూ మరో గుర్తింపు వచ్చింది. ఈ ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అయ్యారు. కాన్ఫిడెన్స్తోపాటు జీవనశైలిలోనూ మంచి మార్పులు వచ్చాయి. మద్దతు అవసరంమహిళలు మారథాన్‌లో పాల్గొనడానికి మన దగ్గర ఇంకా అంత ప్రోత్సాహం లేదనే చెప్పవచ్చు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, ఇరుకు రోడ్లు, సౌకర్యాలు కూడా తక్కువే. విదేశాలలో మారథాన్ అంటే సిటీ మొత్తం ఒక పండగలా జరుగుతుంది. స్త్రీ–పురుష తేడా లేకుండా ఎంతోమంది వచ్చి హుషారుగా పాల్గొంటారు. సామాజికంగానూ ఇది ఐక్యతను సూచిస్తుంది. ఒక తెలియని ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది. దీనివల్ల చేయాలనుకున్న పనుల్లో వేగం కూడా ఉంటుంది. శిక్షణ తప్పనిసరిముందు మనకోసం సొంతంగా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు కుటుంబం నుంచి అంతగా సపోర్ట్ రాకపోవచ్చు. కానీ, పరిస్థితులలో మంచి మార్పులు వచ్చాయి. నేడు మన జీవన విధానంలో ఆహారం, చేస్తున్న పనులకు ఏ మాత్రం ΄÷ంతన లేదు. అందుకే, మహిళలు తప్పనిసరిగా వ్యాయామాలు ఒక అలవాటుగా చేసుకోవాలి. ఏడాదికి రెండు మూడు హాఫ్ మారథాన్లలో పాల్గొంటుంటాను. ఆ తర్వాత ఫుల్ మారథాన్ ఉంటుంది. సాధారణంగా ఫుల్ మారథాన్లనే కౌంట్ చేస్తుంటారు. అందరూ ఆ డిస్టెన్స్‌లో పాల్గొనలేరు. అందుకని హాఫ్ మారథాన్లు, 5కె, 10కె రన్లు జరుగుతుంటాయి. రాబోయే ఫిబ్రవరిలో చండీగఢ్లోహాఫ్ మారథాన్ ఉంది. దానికి శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించారు ఈ మారథాన్ రన్నర్. అడ్డంకులను అధిగమిస్తూ..ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అంతకుముందు అంటార్కిటికా ఐస్ మారథాన్లు రెండు అత్యంత కష్టమైనవే. బోస్టన్‌లో పాల్గొన్న మారథాన్‌లో అయితే బలమైన ఈదురుగాలులు, వర్షం.. అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులు. అయినా, 42.21 కి.మీ మారథాన్‌ని పూర్తి చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆలోచన అడ్డంకులను అధిగమించేలా చేసింది. 3.05 గంటలలో లక్ష్యాన్ని చేరుకున్నా. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకోవడానికి మహిళలే ముందుంటారు. పదేళ్లపాటు చేస్తున్న ఈ జర్నీలో ఇండియాతో పాటు న్యూయార్క్, లండన్, చికాగో, బెర్లిన్, బోస్టన్ – టోక్యోలలో జరిగిన ఆరు ఫుల్ మారథాన్లలో పాల్గొన్నాను. మెడల్స్ ΄÷ందాను. నన్ను చూసి మారథాన్లలో పాల్గొన్న మహిళలు చాలామంది ఉన్నారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో కొందరు హీరోయిన్లు తోపు ఉంటారు. ఎందుకంటే మంచి వయసులో ఉన్న చాలామందికి సాధ్యం కానివి చేసి చూపిస్తుంటారు. ఇక వర్కౌట్ లాంటి వాటితో బాడీని మంచి షేప్‌లో ఉంచుతుంటారు. ఇలాంటి బ్యూటీస్‌లో హీరోయిన్ జ్యోతిక ఒకరు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన మూవీస్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏ హీరోయిన్‌కి సాధ్యం కానిది చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)ముంబయికి చెందిన జ్యోతిక.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. హీరో సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత నటన పక్కనపెట్టేసింది. పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్గా మంచి దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్న జ్యోతిక.. ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. మొన్నీమధ్య భర్త సూర్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంది.ఇకపోతే గతంలో హిమాలయాలు, కశ్మీర్లో ట్రెక్కింగ్ చేస్తూ కనిపించిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే బిజీలో ఉంది. ప్రస్తుతం బేస్ క్యాంప్ వరకు వెళ్లిన విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్కడివరకు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాను. ఏమేం తిన్నాను. అక్కడ వాతావరణం ఎలా ఉంది లాంటి విజువల్స్‌ని రీల్ చేసి పోస్ట్ చేసింది. ఒకవేళ జ్యోతిక గనుక ఎవరెస్ట్ ఎక్కితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ అయిపోతుంది!(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ @ 68
పేదరికాన్ని ఓల్డ్‌సిటీ చూపించింది. దాతృత్వాన్ని నాన్న వైద్యం నేర్పించింది. ఆరోగ్య భద్రతా లేమిని ఆదివాసీ జీవనం తెలిపింది. అందంగా జీవించడాన్ని బాల్య స్నేహం చెప్పింది. కొండంత సాహసాన్ని తనకు తానే చేసింది. డాక్టర్ శోభాదేవి రాసుకున్న రికార్డుల జాబితా ఇది. ‘‘నేను జర్నలిస్ట్‌ని కావాలనుకున్నాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆయన మాటే నెగ్గింది. కానీ నా అచీవ్మెంట్స్తో తరచూ జర్నల్స్‌లో కనిపిస్తూ ఉండటం ద్వారా నేను సంతోషిస్తున్నాను’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. హైదరాబాద్, హిమాయత్ నగర్లో పుట్టి పెరిగి, వెస్ట్ మారేడ్‌పల్లిలో స్థిరపడిన శోభాదేవి ఒక గ్లోబల్ పర్సనాలిటీ. డయాబెటిస్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్‌గా ఆమె పదికి పైగా దేశాల్లో సెమినార్లలో పాల్గొని అధ్యయనాల పేపర్లు సమర్పించారు. కోవిడ్ సమయంలో రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ సేవలందించిన ఈ డాక్టర్ తన పేషెంట్లను హాస్పిటల్ గడప తొక్కనివ్వకుండా ఆరోగ్యవంతులను చేశారు. అందుకు ప్రతిగా ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు ముందు ఆ తర్వాత దేశవిదేశాల్లో ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య వందకు పైగానే. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆమె ఇంట్లో రెండు గదులు మెమెంటోలతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు 8కె చేరుకుని మరో రికార్డు సృష్టించుకున్నారు. అది బేస్ క్యాంపుకు చేరిన రికార్డు మాత్రమే కాదు. 68వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం, మిసెస్ ఇండియా విజేత, అందాల పోటీ కిరీటధారి ఎవరెస్ట్‌ను అధిరోహించడం కూడా రికార్డులే. ప్రతి రోజునూ స్ఫూర్తిదాయకంగా మలుచుకోవడం ఒక కళ. ఆ కళ ఆమె చేతిలో ఉంది. ఇలాంటి సాహసాలు, సరదాలతోపాటు నల్లమల, భద్రాచలం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నివసించే ఆదివాసీలకు ఆరోగ్య చైతన్యం కలిగించడం ఆమెలో మరో కోణం. ‘ఒక డాక్టర్‌గా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్వించడానికి ఎప్పుడూ ముందుంను. అది తండ్రి నేర్పిన విలువల నుంచి గ్రహించిన జీవితసారం’ అన్నారామె. వైవిధ్యభరితమైన తన జీవితప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు డాక్టర్ శోభాదేవి. నాన్న నేర్పిన విలువలు ‘‘మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. అమ్మ రోజరీ కాన్వెంట్ స్కూలో టీచర్. అలా నేను అదే స్కూల్లో చదివాను. నాన్న ఆసక్తి కొద్దీ హోమియోవైద్యం కోర్సు చేసి ఉచితంగా వైద్యం చేసేవారు. నన్ను మెడిసిన్ చదివించడం కూడా నాన్న ఇష్టమే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో నాకు బాలికల కేటగిరీలో రెండవ ర్యాంకు, జనరల్ కేటగిరీలో ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి డయీబెటిస్లో పీజీ, యూకేలో ఒబేసిటీలో కోర్సు చేసి అక్కడ దాదాపు ఇరవై ఏళ్లు పని చేశాను. నాన్న కోసం తిరిగి ఇండియా వచ్చేసి హైదరాబాద్‌లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. ఓల్డ్‌సిటీలో అడిగి మరీ పోస్టింగ్ వేయించుకున్నాను. పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో కళ్లారా చూశాను. పేషెంట్లకు చాయ్, బన్నుకు డబ్బిచ్చి తినేసి రండి మందులు రాసిస్తానని పంపేదాన్ని. ‘భగవంతుడు మనల్ని చాలామంది కంటే మెరుగైన స్థానంలో ఉంచాడు. భగవంతుడిచ్చింది అంతా మన కోసమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ల కోసం పని చేయాల్సిన బాధ్యతను కూడా ఇచ్చి ఈ భూమ్మీదకు పంపాడు. సమాజానికి తిరిగి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాట తరచూ గుర్తు వచ్చేది. ఆ ప్రభావంతోనే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సహాయం చేయడం చిన్నప్పుడే అలవాటైంది. ఆదివాసీల జీవనశైలి గురించి నాకు తెలిసింది బాగా పెద్దయిన తర్వాత మాత్రమే. అడవిలో నివసిస్తూ అక్కడ దొరికే ఆహారం తింటూ కడుపు నింపుకోవడమే వాళ్లకు తెలిసింది. సమతుల ఆహారం అంటే ఏమిటో తెలియదు. సీజన్లో వచ్చే జ్వరాల గురించి అవగాహన కూడా తక్కువే. వాళ్లకు ఆహారం గురించి ఆరోగ్యం చైతన్యవంతం చేయడంతోపాటు ఎసెన్షియల్ ఫుడ్ పౌడర్లు, వంటపాత్రలు, దుప్పట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని రకాల కాయగూరలను పండించుకోవడంలో శిక్షణ ఇచ్చాం. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ప్రధాన భూమిక పోషిస్తాయనే అవగాహన కల్పించగలిగాను. బాల్య స్నేహితురాలి చొరవ బ్యూటీ పాజంట్ అవతారం ఎత్తడానికి కారణం నా స్కూల్ ఫ్రెండ్ రేణుక. మా అబ్బాయిలిద్దరూ యూఎస్‌లో సెటిలయ్యారు. మా వారు 2015లో మాకు దూరమయ్యారు. ఇంత ఇంట్లో నేనొక్కర్తినే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటూ నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేణుక ఆల్బమ్ చేయిస్తానని నా ఫొటోలు తీసుకుని వెళ్లి ‘2019 మిసెస్ తెలంగాణ’ పోటీలకు పంపించేసింది. ఆ తర్వాత నాకు అన్ని ఈవెంట్లలో పాల్గొనక తప్పలేదు. ఫైనల్స్ సమయంలో స్కాట్లాండ్లో ఒబేసిటీ మీద ఇంటర్నేషనల్ సెమినార్‌కి వెళ్లాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే తిట్లు. చివరి నిమిషంలో వచ్చి ఫైనల్ రౌండ్ పూర్తి చేశాను. మిసెస్ ఇండియా పోటీలకు ఇలా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడ్డాను. మిసెస్ ఇండియా విజేత అయినప్పుడు 63 పూర్తయి 64లో ఉన్నాను. సక్సెస్ ఇచ్చే కిక్‌ని బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. నేనే ఉదాహరణ అప్పటి వరకు నేనందుకున్న పురస్కారాల సమయంలో స్ఫూర్తిదాయకమైన మహిళగా ప్రశంసిస్తుంటే నా అర్హతలకు మించిన గౌరవం ఇస్తున్నారేమో అనిపించేది. ఈ వయసులో నేను సాధించిన ఈ లక్ష్యం నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రాణం పోయినా ఫర్లేదనే సంసిద్ధతతో మొదలు పెడతాం, అవాంతరాలెదురవుతాయి, కానీ సాధించి తీరాలనే సంకల్ప శక్తితో ముందుకెళతాం. లక్ష్యాన్ని చేరిన తర్వాత కలిగే ఆత్మవిశ్వాసంతో కూడిన అతిశయం చాలా గొప్ప భావన. చైతన్యవంతంగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు నేనొక ప్రత్యక్ష నిదర్శనం’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. పర్వతం పెద్ద చాలెంజ్ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ ఆరోహణ ఆలోచన మెడిసిన్ క్లాస్‌మేట్స్‌తో న్యూజిలాండ్ టూర్లో వచ్చింది. అక్కడ గ్లేసియర్లు, ట్రెకింగ్ జోన్లు చూసినప్పుడు ఇదేపని మన దగ్గర ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ మన దగ్గర పర్వతారోహణ శిక్షణ కేంద్రాలుండవు. జిమ్, కేబీఆర్ పార్క్, సిటీలో క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు, కర్నాటకలో నందిహిల్స్ నా శిక్షణ కేంద్రాలయ్యాయి. ఎవరెస్ట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసింది. డాక్టర్‌గా నా వృత్తికి నూటికి నూరుశాతం సేవలందించాల్సిన సమయం అది. నా పేషెంట్ల నంబర్ రాసుకోలేదు కానీ పేషెంట్లకు మందులు, ఇతర జాగ్రత్తలు, ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్‌లో రోజూ తెల్లవారు జామున రెండు– మూడు గంటల వరకు ఆన్లైన్లో టచ్‌లో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకూ కోవిడ్ వచ్చింది, తగ్గింది. కానీ వెన్ను పట్టేయడం, ఫ్రోజన్ షోల్డర్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధించాయి. వాటన్నింటినీ చాలెంజ్‌గా తీసుకుని బయటపడి పర్వతారోహణ చేశాను. మేనెల ఆరవ తేదీ హైదరాబాద్ నుంచి బయలేరి ఖాట్మండూకు వెళ్లాను. ఎనిమిదో తేదీన ‘లుక్లా’ నుంచి నడక మొదలు పెట్టి 15వ తేదీకి బేస్ క్యాంపులో ఎత్తైన శిఖరం ‘8కె’కి చేరాను. ఈ ట్రిప్‌లో నేను పర్వతారోహకులకు మార్గాన్ని సుగమం చేసే షెర్పాల దయనీయమైన జీవితాన్ని దగ్గరగా చూశాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తుంటారు వాళ్లు. – వాకా మంజులారెడ్డి -
సాహోరే టీనేజర్!
హైదరాబాద్: సరదా అభిరుచి వారిని గుట్టలెక్కించింది. సీరియస్ వ్యాపకంగా మారి సుదూరాల్లోని శిఖరాల్ని అధిరోహింపజేసింది. నగరానికి చెందిన ముగ్గురు టీనేజర్లు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పూర్తి చేసుకున్నారు. తమ బృందంతో కలిసి ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉన్న వీరు మరో 2 రోజుల్లో నగరానికి చేరుకోనున్నారు. నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న హాసికారెడ్డి (15), ప్రస్తుతం ఐఐటీ జేఈఈకి ప్రిపేరవుతోంది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో చదువుతున్న సృజన్ తిమ్మిరెడ్డి సాట్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఫిట్ జీలో 12వ తరగతి చదువుతున్న కృషి గుప్తా (16).. ఐఐటీ జేఈఈకి ప్రిపేర్ అవుతోంది. వ్యక్తిగతంగా వీరికి తమ కెరీర్ లక్ష్యాలు వేరైనా.. అభిరుచులు కలిశాయి. విభిన్న రకాల హాబీలతో పాటు చదువులోనూ రాణిస్తున్న వీరంతా.. కొన్ని నెలలుగా ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి పెంచుకుని ఫ్రెండ్స్‌గా మారారు. నగరం చుట్టుపక్కల ఉన్న కొండల్ని గుట్టల్ని ఎక్కడం అలవాటు చేసుకున్నారు. ఆ క్రమంలోనే వీరికి మరికొందరు పెద్దలూ జత కలిశారు. వయసులకు అతీతంగా ఆటపాటలతో పాటు అడ్వెంచర్ ట్రెక్స్ని ఆస్వాదిస్తున్నారు. వైనాట్ ఎవరెస్ట్? చిన్నా చితకా కొండలు గుట్టలు ఏల? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే ఆలోచన ఈ బృందానికి వచ్చింది. అదే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పూర్తి చేయాలని. ఒక్కసారి అత్యంత ఎత్తయిన శిఖరారోహణకు ప్రాథమిక దశను పూర్తి చేస్తే.. ఇక అది ఇచ్చే ఆత్మవిశ్వాసం జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కునేందుకు అవసరమైన సత్తా ఇస్తుందని భావించారు. అందరూ కలిసి చర్చించుకున్నారు. మిగిలిన అందరూ వయసులో పెద్దవాళ్లు కాబట్టి పర్లేదు కానీ టీనేజర్లయిన ముగ్గురి విషయంలో కాస్త చర్చ జరిగింది. తాము సైతం అని ముగ్గురూ కృత నిశ్చయం వ్యక్తం చేయడం, ముగ్గురి తండ్రులూ బృందంలో ఉండడంతో గత కొన్ని రోజుల పాటు తమకు తాముగానే సాధన చేసి వీరంతా సిద్ధమయ్యారు. వేల కి.మీ ఎత్తులో... ఈ నెల 13న వీరంతా నగరాన్ని వదిలి లక్ష్యసాధన దిశగా పయనమయ్యారు. నేపాల్ చేరుకుని అక్కడి గైడ్స్ సహకారంతో.. పూర్తి సన్నద్ధతతో ముందడుగు వేశారు. ఎవరెస్ట్ పర్వతారోహణలో ప్రాథమిక దశ అయిన బేస్ క్యాంప్ పూర్తి చేయడం కోసం వీరు ఎక్కాల్సింది 5364 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం.. సుమారు 65 కి.మీల ఎత్తు పల్లాలతో శిఖరాల మీదుగా నడక ఉంటుంది. ఇందులో భాగంగా 8 రోజుల పాటు సాగిన వీరి సాహస యాత్ర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, అవాంతరాలు తప్ప మరే అడ్డంకులూ లేకుండా గత ఆదివారం ముగిసింది. మరో 2 రోజుల్లో ఈ బృందం నగరానికి చేరుకోనుంది. నిర్విరామంగా.. 0– 9 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. 3.5 కి.మీ మేర మంచు దుప్పట్లో 12 గంటల పాటు శిఖరాలపై నడవాల్సి రావడంతో చివరలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయని, చెప్పుకోదగ్గ ఇబ్బందులేవీ ఎదురుకాలేదని బృందంలో సభ్యుడైన ప్రశాంత్‌రెడ్డి ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. కొంత కష్టతరమైనప్పటికీ ఈ తరహా సాహసాలతో టీనేజర్లకు ఒనగూరే ఆత్మవిశ్వాసం విలువ లెక్కకట్టలేనిదని ఆయన చెప్పారు. -
ఎవరెస్ట్ పర్వతాన చిన్నారి పాదాలు
ఆరేళ్ల పాప కారిడార్‌లో ఆడుతుంటేనే చిన్న భయం ఉంటుంది. 17,500 అడుగుల ఎత్తు ఉండే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకోవాలనుకుంటే? పూణెకు చెందిన ఆరేళ్ల ఆరిష్క లడ్డా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్న అత్యంత చిన్నారిగా రికార్డు స్థాపించింది. తల్లితో కలిసి పదిహేను రోజులపాటు ఆరోహణ చేసి ఈ సాహసకార్యం పూర్తి చేసింది. కొంతమంది చిన్నారులు పుట్టుకతో చిరుతలు అని పాడుకోవాలి ఇలాంటి పిల్లలను చూస్తే. ఆరేళ్ల ఐదు నెలల వయసు ఉన్న ఆరిష్కా లడ్డాకు నిజంగా తానేం ఘనకార్యం చేసిందో తెలియదు. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం బేస్ క్యాంప్‌కు చేరుకోవడం అంత చిన్న వయసులో అసాధ్యమైనా సాధ్యం చేసిందనీ తెలియదు. తల్లి చేయి పట్టుకుని ఎంత దూరమైనా సాగగలను అనే నమ్మకమే ఆరిష్కాను సముద్ర మట్టానికి 17,500 ఎత్తు ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేర్చింది. ఫూణెలో ఇప్పుడు ఆ పాప నివాసం ఉంటున్న కొత్రుడ్ ఏరియా, చదువుతున్న స్కూలు, బంధువులు అందరూ గర్వపడుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు తీసుకెళ్లరు. ఎందుకంటే పర్వతారోహణ సమయంలో తమ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు వస్తున్నదో చిన్న వయసు పిల్లలు స్పష్టంగా చెప్పలేరు. అలా చెప్పకపోతే ప్రమాదం వస్తుంది. మేము రిజిస్టర్ చేసుకున్న సంస్థను నడిపే భగవాన్ చావ్లే మా పూణెకు చెందిన పర్వతారోహకుడు. మూడుసార్లు ఎవరెస్ట్ ఎక్కాడాయన. పర్వతారోహణలో విశేష అనుభవం ఉంది. ఆయన మార్గదర్శకత్వంలో నేను ఆరిష్కాతో పాటుగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లాలనుకున్నప్పుడు– మీ సొంత రిస్క్ మీద తీసుకువెళతాను. కాని పాప ఆరోగ్యంలో ఏ మాత్రం మార్పు వచ్చినా వెంటనే వెనక్కు పంపిస్తాను అని చెప్పాడు. నేను అంగీకరించాను. ఎందుకంటే నా కూతురు సాధించగలదన్న నమ్మకం ఉంది’ అంది ఆరిష్కా తల్లి డింపుల్ లడ్డా. ప్రాథమిక శిక్షణ ఆరిష్కా పూణెలో వారాంతంలో చుట్టుపక్కల కోటలను, కొండలను ట్రెక్ చేసేది. గత సంవత్సరం వైష్ణోదేవికి వెళ్లినప్పుడు కూడా హుషారుగా నడిచింది. ‘అది గమనించాకే బేస్‌క్యాంప్‌కు నడవగలదు అన్న నమ్మకం కుదిరింది’ అంది డింపుల్. ఏప్రిల్ మొదటివారంలో మొదలైన వీరి ఆరోహణ పోను 65 కిలోమీటర్లు రాను 65 కిలోమీటర్లు మొత్తం 130 కిలోమీటర్ల పొడవునా కాలినడకన సాగింది. అంత దూరమూ ఆరిష్కా తల్లికి సహకరిస్తూ హుషారుగా నడవగలిగింది. ఖర్జూరాలు, డ్రైఫ్రూట్ లడ్డూలు పర్వతారోహణ చేయాలంటే చాలా శక్తి కావాలి. అందుకు మంచి ఆహారం ఉండాలి. ‘మేము శాకాహారులం. పర్వతారోహణలో మాకు పప్పన్నం మాత్రమే శాకాహారంగా దొరికింది. అయితే పాపకు నేను ఖర్జూరాలు, డ్రైఫ్రూట్ లడ్డూలు ఎక్కువగా పెట్టాను. వేణ్ణీళ్లు ఎక్కువగా తాగేలా చూశాను. చలి నుంచి కాపాడటానికి 7 దొంతరల బట్టలు తొడిగి జాగ్రత్త తీసుకున్నాను. ఆ దారిలో మైనస్ 3 నుంచి మైనస్ 16 వరకు ఉష్ణోగ్రతలు ఉండేవి. ఒక్కోసారి పాప తలనొప్పి, చెవుల నొప్పి అని కంప్లయింట్ చేసేది. అయితే అదృష్టవశాత్తూ కొద్దిపాటి మందులతో కుదుట పడింది’ అని తెలిపింది డింపుల్. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చెయ్యూపుతూ నిలబడటంతో మన దేశం నుంచి అత్యంత చిన్న వయసులో అక్కడివరకూ చేరిన చిన్నారిగా ఆరిష్కా రికార్డు సాధించింది. ‘ఇక ఆమెను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దుతాను. ఎవరెస్ట్ ఎక్కేలా చేస్తాను. తోడుగా కావాలంటే నేనూ ఎక్కుతాను’ అని తెలిపింది డింపుల్. తండ్రి కౌస్తుభ్ ‘నా కూతురిని చూసి గర్వపడుతున్నాను. ఈ ఘనత అంతా తల్లీకూతుళ్లదే. నేను కేవలం సపోర్టింగ్ యాక్టర్‌ని’ అని నవ్వాడు. ఆరిష్కాకు అభినందనలు. పాపను చలి నుంచి కాపాడటానికి 7 దొంతరల బట్టలు తొడిగి జాగ్రత్త తీసుకున్నాను. ఆ దారిలో మైనస్ 3 నుంచి మైనస్ 16 వరకు ఉష్ణోగ్రతలు ఉండేవి. – డింపుల్, అరిష్కా తల్లి -
న్యూస్‌మేకర్..: ఎవరెస్ట్‌కు హలో చెప్పింది
పదేళ్ల అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటూ ఉంటే కన్నేసి పెడతాం. స్కూల్ నుంచి వచ్చే వరకూ ఎదురు చూస్తాం. పార్క్‌కు వెళ్తానంటే తోడు వెళ్తాం. కాని ఎవరెస్ట్ వరకూ వెళ్తానంటే? ముంబై చిన్నారి పదేళ్ల రిథమ్ మమానియా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరిన చిచ్చర పిడుగుగా రికార్డు సృష్టించింది. నేపాల్‌లోని లుక్లా ఎయిర్పోర్ట్ నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు కాలి నడకన ఎక్కి దిగిన రిథమ్మొత్తం 128 కిలోమీటర్లను చిట్టి పాదాలతో గెలిచేసింది. ఊరు దాటడానికి కూడా బద్దకించే వారిని చూసి పకపకా నవ్వింది. సాహసం ఎవరి సొత్తూ కాదు... భయాన్ని దాటి విజయాన్ని సాధించడం మాకూ చేతనవును అని ఇటీవల ఎందరో భారతీయ స్త్రీలు ఎవరెస్ట్‌ను అధిరోహించి, బేస్ క్యాంప్ వరకూ చేరుకుని నిరూపిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన మార్గంలో, అనూహ్యమైన వాతావరణంలో, బృందాలుగా లేదా ఒకరిద్దరి సహాయంతో వారు ఈ సాహసాలు చేస్తున్నారు. కేరళ నుంచి నుంచి కశ్మీర్ వరకూ ఈ దారిలో ఉన్న వనితలు ఎందరో ఉన్నారు. 1983లో బచేంద్రి పాల్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయ వనితగా ఖ్యాతి గడించినప్పటి నుంచి ఆ స్ఫూర్తిని ఎందరో కొనసాగిస్తున్నారు. మన ఖమ్మంకు చెందిన పూర్ణ అతి తక్కువ వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన అమ్మాయిగా రికార్డు సాధిస్తే ఇటీవల భువనగిరికి చెందిన అన్విత రెడ్డి ఎవరెస్ట్‌ను అధిరోహించి తెలుగువారి ఘనతను మరోసారి చాటింది. 53 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ ఎక్కిన సంగీత భెల్ స్ఫూర్తినిస్తే 10 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లి తనదైన రికార్డు సాధించింది రిథమ్ మమానియా. స్కేటింగ్ నుంచి రిథమ్ మమానియాకు ముంబై వండర్‌కిడ్‌గా పేరు. చిన్నప్పటి నుంచి ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్న రిథమ్‌కు ఎవరెస్ట్ గురించి తల్లిదండ్రులు చెప్పినప్పుడల్లా అక్కడకు వెళ్లాలన్న కుతూహలం కలిగేది. ఆటపాటల్లో, స్కేటింగ్‌లో ఎంతో ప్రతిభ చూపే రిథమ్‌ను తల్లిదండ్రులు ఉర్మి, హర్షల్ ఆమెను నిరుత్సాహ పరచలేదు. ఎనిమిదేళ్లు వచ్చాక ఆమెను తరచూ సహ్యాద్రి పర్వతాలలోకి ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లేవారు. ‘దూద్‌సాగర్’కు అలసట లేకుండా రిథమ్ నడిచినప్పుడు ఎవరెస్ట్ కలను నిజం చేయడానికి సహకరిద్దాం అని నిశ్చయించుకున్నారు. మొన్నటి ఏప్రిల్ చివరి వారంలో అందుకు శ్రీకారం చుట్టారు. నేపాల్ లుక్లా నుంచి నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకునేవారు, ఎవరెస్ట్‌ను అధిరోహించేవారు ఉంటారు. రిథమ్ కూడా ఆ మార్గాన్నే ఎంచుకుంది. లుక్లా సముద్ర మట్టానికి 9,318 అడుగులు ఉంటే అక్కడి నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 8,280 అడుగులు ఉంటుంది (బేస్ క్యాంప్ సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తు). కురిసే మంచు, మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆక్సిజన్ కొరత ఇలాంటి రిస్క్‌లు ఎన్ని ఉన్నా లుక్లా నుంచి కాలిమార్గాన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు తల్లిదండ్రుల తోడుతో ఏప్రిల్ 25న బయలుదేరింది రిథమ్. ఇందుకు నేపాల్‌లోని ఒక అడ్వంచర్స్ సంస్థ గైడ్‌గా వ్యవహరించింది. పోను 64 కి.మీ రాను 64 కి.మీ. దూరాన్ని మే 6న 11 రోజుల్లో పూర్తి చేసింది రిథమ్. ఆమెతో కలిసి వెళ్లిన బృందం తిరుగు ప్రయాణానికి హెలికాప్టర్‌ను ఎంచుకున్నా రిథమ్ నడక ద్వారానే తిరిగి లుక్లా చేరుకుంది. అంటే సంపూర్ణంగా తను ఆ దారిలోని కష్టనష్టాలను భరించింది. ఇంత చిన్న వయసులో ఇదంతా సాధించడం సామాన్యం కాదు. అనుకున్నది సాధించండి అనుకున్నది సాధించాలని గట్టిగా అనుకోండి. మీ కలలను ఆపవద్దు. వాటిని నెరవేర్చుకోండి అంది రిథమ్. మన వల్ల అవుతుందా మనం చేయగలమా అనే సందేహాలు ఉన్న ఎందరో ఈ మాట నుంచి స్ఫూర్తి పొందాలి. అనుకున్నది సాధించాలి. -
పులకించిన కిలిమంజారో
కిలిమంజారో పర్వతం. ఓ దశాబ్దంగా వార్తల్లో తరచూ కనిపిస్తున్న ఈ పర్వతం మీదనున్న ఉహురు శిఖరం ఎత్తు 5895 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎల్తైన పర్వతం ఇది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎల్తైన ఏడు పర్వతశిఖరాల్లో నాలుగవది. ఈ శిఖరం మీద అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంటనియర్ పదమూడేళ్ల పులకిత హస్వి మన తెలుగమ్మాయి. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో అధిరోహించాలనే కోరిక ఇంత చిన్న వయసులో ఎందుకు కలిగి ఉంటుంది... అనే సందేహం రావడం సహజమే. ఇది హస్వికి కోవిడ్ కాలంలో రేకెత్తిన ఆలోచన. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు లేవు. పులకిత హస్వి ఇష్టంగా నేర్చుకుంటున్న బ్యాడ్మింటన్‌ను కూడా విరామం తప్పలేదు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలు చూడడమే పనిగా ఉన్న సమయం అది. ఆ చూడడంలో ఎవరెస్ట్ అనే ఇంగ్లిష్ సినిమాను చూడడం కాకతాళీయమే. కానీ ఆ చూడడం ఈ అమ్మాయి అభిరుచిని, గమనాన్ని మార్చేసింది. ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిపించింది. ఆ తర్వాత కిలిమంజారో శిఖరానికి చేర్చింది. ఇదంతా ఈ ఏడాదిలో జరిగిన పురోగతి మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా చూసింది, ఎవరెస్ట్ అధిరోహిస్తానని అమ్మానాన్నలను అడిగింది. ఏప్రిల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రోజు రాత్రి అమ్మానాన్నలతో ‘సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేస్తాన’ని తన తర్వాతి లక్ష్యాన్ని బయటపెట్టింది పులకిత హస్వి. అలాగే కిలిమంజారో పర్వతారోహణ పూర్వాపరాలను సాక్షితో పంచుకుంది. తొలి ఘట్టం ఎవరెస్ట్ బేస్ క్యాంపు ‘‘మా నాన్నది మంచిర్యాల, అమ్మ వాళ్ల ఊరు కర్నూలు జిల్లా నంద్యాల. ఇద్దరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నా చిన్నప్పుడు వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉండేవాళ్లం. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి అవకాశం బాగా ఉండేది. అన్నయ్య, నేను ఇద్దరం ఎప్పుడూ ఏదో ఒక కోచింగ్ లో ఉండేవాళ్లం. కీబోర్డ్, గిటార్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆర్కిస్టిక్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసి నేషనల్స్‌కు వెళ్లాను. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సీరియెస్‌గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. కానీ కోవిడ్‌తో ప్రాక్టీస్ ఆగిపోయింది. మౌంటనియరింగ్ వైపు దృష్టి మళ్లింది. ఎవరెస్ట్ అధిరోహించడానికి ముందు బేస్‌క్యాంప్ ట్రెక్ పూర్తి చేసి ఉండాలి. అందుకే తొలి ప్రయత్నంగా బేస్ క్యాంపు ట్రెక్ పూర్తి చేశాను. 2024–2025 కి సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేయాలనేది నా టార్గెట్. ఆ తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ వైపు వెళ్లాలనేది ఇప్పటి నా ఆలోచన. సెవెన్ సమ్మిట్స్ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను’’ అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వింది పులకిత హస్వి. గడ్డకట్టిన నీళ్లు ‘కిలిమంజారో సమ్మిట్ పూర్తి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడితో సంతృప్తి చెందితే మిగిలిన సమ్మిట్స్ పూర్తి చేయలేనని కూడా ఆ క్షణంలోనే గుర్తు వచ్చింది’ అంటూ కిలిమంజారో అధిరోహణ అనుభవాలను చెప్పింది పులకిత హస్వి. ‘‘సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఎనిమిది వరకు సాగిన ట్రిప్‌లో యాక్చువల్ పర్వతారోహణ మొత్తం ఐదు రోజులే. నాలుగో రోజు శిఖరాన్ని చేరతాం. ఐదవ రోజు కిందకు దిగుతాం. శిఖరాన్ని చేరే లోపు నాలుగు రోజుల్లో ఏడెనిమిది రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచు దట్టంగా పొగలా కమ్మేసి ఉంటుంది. ముందు ఏముందనేది స్పష్టంగా కనిపించదు. నాలుగో రోజు ఆహారం కూడా ఉండదు. రెండు చాక్లెట్లు, ప్రొటీన్ బార్ మాత్రమే ఆహారం. అంతకు మించి ఏమీ తినాలనిపించదు కూడా. మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మాతో తీసుకువెళ్లిన బాటిల్లోని నార్మల్ వాటర్ గడ్డకట్టిపోయాయి. ఫ్లాస్క్‌లో తీసుకువెళ్లిన వేడినీటిని కలుపుకుని తాగాను. స్నోఫాల్ని దగ్గరగా చూడగలిగాను. కిలిమంజారో పర్వతం మీద మంచు కురుస్తుంటే పక్కనే మరో పర్వతం మీద సూర్యుడి కిరణాలు కాంతులీనుతున్నాయి. ప్రకృతి చేసే ఇలాంటి అద్భుతమైన విన్యాసాలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పర్వతారోహణ వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. స్పాట్ డెసిషన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్‌గా తెలిసి వచ్చింది. ఐదవరోజు పర్వతాన్ని దిగేటప్పుడు చాలాసార్లు పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాను. ‘అయ్యో పడిపోయావా’ అంటూ లేవదీయడానికి ఎవరూ ఉండరు. మనకు మనమే సంభాళించుకుని లేచి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఒకటి– రెండు సార్లు పడిన తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత పడకుండా సాగిన ప్రయాణమే పెద్ద విజయంగా అనిపిస్తుంది. కిలిమంజారో ఎక్స్‌పెడిషన్‌కు వెళ్లడానికి ముందు మూడు నెలలపాటు ఫిట్నెస్ ప్రాక్టీస్ చేశాను. ఫిట్నెస్ క్లాసులు కూడా డిజిటల్ మీడియా ద్వారానే. మా కోచ్ వాట్సాప్‌లో ఏరోజుకారోజు టాస్క్ ఇస్తారు. హైట్స్‌కి వెళ్లకుండా ప్రాక్టీస్ మొత్తం నేల మీదనే కావడంతో శిఖరం మీదకు వెళ్లినప్పుడు వామిటింగ్ ఫీలింగ్ కలిగింది. అంతకు మించి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మా టీమ్‌లో మొత్తం ఏడుగురున్నారు. నేనే చిన్నదాన్ని. అరవై ఏళ్ల మౌంటనియర్ కూడా ఉన్నారు. మాలో శిఖరాన్ని చేరింది నలుగురే. కిలిమంజారో పర్వతారోహణ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందనేది నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఏడు సమ్మిట్స్‌ని పూర్తి చేసి తీరుతాను’’ అన్నది హస్వి. సెవెన్ సమ్మిట్స్ ఎవరెస్ట్ (8,849 మీటర్లు)– ఆసియా, అకాంగువా (6,961 మీటర్లు) – సౌత్ అమెరికా, దేనాలి (6,194 మీటర్లు)– నార్త్ అమెరకా, కిలిమంజారో (5,895 మీటర్లు)– ఆఫ్రికా, ఎల్బ్రస్ (5,642 మీటర్లు)– యూరప్, విన్సాన్ మాసిఫ్ (4,892 మీటర్లు)– అంటార్కిటికా, కోస్కియుజ్కో (2,228 మీటర్లు) – ఆస్ట్రేలియా. పులకిత సాధించిన పతకాలు; కిలిమంజారో నేషనల్ పార్క్ వద్ద పులకిత -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన విద్యార్థులు
-
ఎవరెస్ట్‌పై చిక్కుకున్న తెలుగువారు
-
ఎవరెస్టు నుంచి భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: ఎవరెస్టు పర్వతంపై చిక్కకుపోయిన భారతీయులను క్షేమంగా బేస్ క్యాంప్‌నకు తరలించారు. శనివారం సంభవించిన భూకంపం ప్రభావంతో ఎవరెస్టు క్యాంప్ 1, 2 వద్ద పర్వతారోహకులు చిక్కుకుపోయారు. హెలికాప్టర్ల సాయంతో వీరిని బేస్ క్యాంప్‌నకు తరలించినట్టు ఓ అధికారి తెలిపారు. వీరిలో పర్వాతరోహకులు, విదేశీయులున్నట్టు చెప్పారు. భారత్‌కు చెందిన మూడు బృందాలు ఎవరెస్టు అధిరోహణకు వెళ్లాయి. మరికొందరు విదేశీయులు కూడా వెళ్లారు. శనివారం భూప్రకంపల కారణంగా క్యాంప్ 1, 2 ల వద్ద సుమారు 30 నుంచి 40 మంది చిక్కుకుపోయారు. ఓ బృందం నేపాల్ రాజధాని కాఠ్మండుకు చేరింది. మిగిలిన రెండు బృందాలు బేస్ క్యాంప్ వద్ద ఉన్నాయి. వీరిని న్యూఢిల్లీకి ఎప్పుడు తరలిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. -
నేను క్షేమంగానే ఉన్నా: నీలిమ
హైదరాబాద్: నేపాల్ లో చిక్కుకున్న హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ సురక్షితంగా ఉంది. తాను క్షేమంగా ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి కిందకు దిగుతున్నట్టు తమ కుమార్తె ఫోన్ లో చెప్పిందని నీలిమ కుటుంబ సభ్యులు తెలిపారు. మరో రెండు రోజుల్లో నీలిమ బృందం రాష్ట్రానికి తిరిగి రావొచ్చని వెల్లడించారు. ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ.. భూకంపం రావడంతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద చిక్కుకుపోయింది. మరికొన్ని గంటల్లో ఎవరెస్ట్‌పైనున్న టింగ్‌బోచి అనే బేస్‌క్యాంప్‌నకు చేరుకుంటారనగా... భూకంపం సంభవించడంతో నీలిమ బృందం ఆచూకీ గల్లంతయ్యింది. ఈ బృందంలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరు అమెరికాకు చెందినవారు. నీలిమ క్షేమంగా ఉందన్న తెలియడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
'చాలా మంది ఆచూకీ లభ్యం కావడం లేదు'
నేపాల్ : భూకంపం ధాటికి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై రెండు సార్లు మంచు చరియలు విరిగిపడ్డాయని నేపాల్ టూరిజం శాఖ మంత్రి జ్ఞానేంద్ర శ్రేష్ఠ తెలిపారు. శనివారం శ్రేష్ఠ మాట్లాడుతూ... ఇప్పటి వరకూ 8 మంది మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. వేసవి కావడంతో ఎవరెస్ట్ ఎక్కేందుకు 40 మంది విదేశీయులు సహా వేయి మంది బేస్ క్యాంపునకు చేరుకున్నారన్నారు. అయితే వారిలో చాలా మంది ఆచూకీ లభ్యం కావడం లేదని శ్రేష్ఠ వెల్లడించారు. అలాగే మృతి చెందిన వారు ఏ దేశానికి చెందిన వారో... ఇంకా తెలియండ లేదని శ్రేష్ఠ పేర్కొన్నారు.