'చాలా మంది ఆచూకీ లభ్యం కావడం లేదు' | 1000 people in everest base camp, says nepal tourism minister | Sakshi
Sakshi News home page

'చాలా మంది ఆచూకీ లభ్యం కావడం లేదు'

Published Sat, Apr 25 2015 9:37 PM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM

'చాలా మంది ఆచూకీ లభ్యం కావడం లేదు' - Sakshi

'చాలా మంది ఆచూకీ లభ్యం కావడం లేదు'

నేపాల్ : భూకంపం ధాటికి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై రెండు సార్లు మంచు చరియలు విరిగిపడ్డాయని నేపాల్ టూరిజం శాఖ మంత్రి జ్ఞానేంద్ర శ్రేష్ఠ తెలిపారు. శనివారం శ్రేష్ఠ మాట్లాడుతూ... ఇప్పటి వరకూ 8 మంది మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. వేసవి కావడంతో ఎవరెస్ట్ ఎక్కేందుకు 40 మంది విదేశీయులు సహా వేయి మంది బేస్ క్యాంపునకు చేరుకున్నారన్నారు. అయితే వారిలో చాలా మంది ఆచూకీ లభ్యం కావడం లేదని శ్రేష్ఠ వెల్లడించారు. అలాగే మృతి చెందిన వారు ఏ దేశానికి చెందిన వారో... ఇంకా తెలియండ లేదని శ్రేష్ఠ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement