న్యూఢిల్లీ: ఎవరెస్టు పర్వతంపై చిక్కకుపోయిన భారతీయులను క్షేమంగా బేస్ క్యాంప్నకు తరలించారు. శనివారం సంభవించిన భూకంపం ప్రభావంతో ఎవరెస్టు క్యాంప్ 1, 2 వద్ద పర్వతారోహకులు చిక్కుకుపోయారు. హెలికాప్టర్ల సాయంతో వీరిని బేస్ క్యాంప్నకు తరలించినట్టు ఓ అధికారి తెలిపారు. వీరిలో పర్వాతరోహకులు, విదేశీయులున్నట్టు చెప్పారు.
భారత్కు చెందిన మూడు బృందాలు ఎవరెస్టు అధిరోహణకు వెళ్లాయి. మరికొందరు విదేశీయులు కూడా వెళ్లారు. శనివారం భూప్రకంపల కారణంగా క్యాంప్ 1, 2 ల వద్ద సుమారు 30 నుంచి 40 మంది చిక్కుకుపోయారు. ఓ బృందం నేపాల్ రాజధాని కాఠ్మండుకు చేరింది. మిగిలిన రెండు బృందాలు బేస్ క్యాంప్ వద్ద ఉన్నాయి. వీరిని న్యూఢిల్లీకి ఎప్పుడు తరలిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.