ఈ కారణం వల్లే సూర్యతో పెళ్లి.. మొదటిసారి రివీల్‌ చేసిన జ్యోతిక | Jyothika First Time Reveals Their Love Story And Reason Behind Why She Married Suriya, Deets Inside - Sakshi
Sakshi News home page

Suriya-Jyothika Love Story: సినిమాలో రొమాంటిక్‌ సీన్‌ ఉంటే సూర్య ఈ లిమిట్స్‌లోనే ఉంటాడు: జ్యోతిక

Oct 19 2023 2:58 PM | Updated on Oct 19 2023 3:47 PM

Jyothika With Suriya Love Story Reveal - Sakshi

కోలీవుడ్‌లో అందమైన కపుల్స్‌ అంటే వెంటనే చెప్పే పేరు సూర్య- జ్యోతికలదే.  2006లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. జ్యోతిక స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో సూర్యకు అంతగా గర్తింపు లేదు. కానీ అవన్నీ పట్టించుకోకుండా సూర్యను ప్రేమించి జ్యోతిక పెళ్లి చేసుకున్నారు. అయితే సూర్యను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన తనలో ఎలా వచ్చిందో జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

(ఇదీ చదవండి: Bhagavanth Kesari : ‘భగవంత్‌ కేసరి’ మూవీ రివ్యూ)

తాజాగా అక్టోబర్ 18న జ్యోతిక తన 45వ పుట్టిన రోజు జరుపుకున్నారు. వారి మధ్య ప్రేమ,పెళ్లి అన్నీ కూడా నెల రోజుల్లోనే జరిగిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తనకు సూర్య ఇచ్చే గౌరవం వల్లే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో తాము కలిసి నటించిన సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని జ్యోతిక తెలిపారు. అలా తామిద్దరం కలిసి ఏడు సినిమాల్లో కలిసి నటించామని చెప్పారు.

సినిమాలో భాగంగా రొమాంటిక్‌ సీన్‌ ఉన్న సమయంలో  డైరెక్టర్‌ సూచన మేరకు మాత్రమే పరిమితం అయి సూర్య నటిస్తాడు. దానిని అదునుగా ఏ మాత్రం తీసుకోడు. అలా మహిళల పట్ల ఆయన ఇచ్చే గౌరవమే తనను ఎక్కువగా ఆకర్షించేలా చేసినట్లు జ్యోతిక పేర్కొన్నారు. సూర్యను పెళ్లి చేసుకునే సమయానికే తాను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటింది.

మొదట సూర్యనే చెప్పాడు
రోజంతా షూటింగ్‌ పనుల వల్ల బాగా అలసిపోయేదానిని.. అప్పటికే తనకు అవసరమైనంత మొత్తంలో డబ్బు సంపాదించడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నట్లు జ్యోతిక చెప్పారు. అలాంటి సమయంలోనే మొదటగా సూర్య తనకు  ప్రపోజ్ చేశాడని తెలిపారు. సూర్య గురించి ఇంట్లో తన తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత వారు కూడా తమ పెళ్లికి అంగీకరించారని చెప్పారు. దీంతో తామిద్దరం ఒకటయ్యామని ఆమె వివరించారు.

ఆ ఇంటర్వ్యూలో సూర్య గురించి జ్యోతిక ఇలా చెప్పారు . 'ఒక తండ్రిగా సూర్య చాలా సిన్సియర్‌గా ఉంటాడు. భర్తగా సిన్సియర్‌గా ఉండటమే కాకుండా నాకు సరైన గౌరవం ఇస్తాడు. దీంతో సూర్యను చూసిన వారందరూ..  అతన్ని చూసి నేర్చుకోమని తమ భర్తలకు చాలామంది మహిళలు చెప్పడం ప్రత్యక్షంగా నేను చూశాను. సూర్య ప్రతి ఆనందక్షణాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఇలా ప్రతి విషయంలో సూర్య ఎంతో స్పెషల్‌. నా జీవితంలోకి సూర్య రావడం నా అదృష్టం.' అని జ్యోతిక తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement