
Uppena Heroine Krithi Shetty To Act With Suriya: కోలీవుడ్ నుంచి హీరోయిన్ కృతీశెట్టికి కబురొచ్చిందట. సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేసవిలో ప్రారంభం కానుంది. ఇందులో ఓ హీరోయిన్ పాత్రకు కృతీ శెట్టిని తీసుకున్నారన్నది చెన్నై కోడంబాక్కమ్ టాక్. అలాగే మరో హీరోయిన్‌గా జ్యోతిక కనిపిస్తారట. ఒకవేళ ఒక హీరోయిన్‌గా కృతీ శెట్టి పేరు కన్ఫార్మ్ అయితే ఈ బ్యూటీకి సూపర్ చాన్స్ దక్కినట్లే.
ఎందుకంటే విలక్షణ దర్శకుడు బాల, స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో సినిమా అంటే కృతీ డైరీలో ఓ భారీ ప్రాజెక్ట్ చేరినట్లే. ఇక తెలుగులో కృతీ హీరోయిన్‌గా చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న రామ్ ‘ది వారియర్’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. చదవండి: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో బేబమ్మ రొమాన్స్..