
హీరోయిన్ జ్యోతిక వెబ్ ఎంట్రీ ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి హిందీ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్‌పై నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సద్వానీ రెండో వెబ్‌సిరీస్ నిర్మించనున్నారు. సోనాలీ బోస్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో ఓ లీడ్ యాక్ట్రస్‌గా జ్యోతికను అనుకున్నారట మేకర్స్.
స్క్రిప్ట్ నచ్చడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ఐదుగురు గృహిణులు రహస్యంగా ఓ వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నదే ఈ వెబ్‌సిరీస్ కథాంశమట. దీనిపై అధికారిక ప్రకటన వెల్లడైతే జ్యోతిక నటించే తొలి వెబ్‌సిరీస్ ఇదే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment