హీరోయిన్ జ్యోతిక 'వాలి' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, శింబు వంటి ప్రముఖ హీరోలకు జంటగా నటించి టాప్ హీరోయిన్‌గా రాణించింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. పూవెల్లామ్ కేట్టుప్పార్ చిత్రంలో నటిస్తున్న సమయంలో హీరో సూర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2006లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి దేవ్, దియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కుటుంబం కోసం కొంత కాలం నటనకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ నటించడం మొదలెట్టింది. 36 వయదునిళే చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక తనకు తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటోంది. కాగా ఇటీవల ఈమె ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు పేర్కొంది.
నూతన దర్శకులే మహిళా ఇతివృత్తంతో కూడిన చిత్రాలను చేస్తున్నారని, పెద్ద దర్శకులు అలాంటి చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. నిజానికి హీరోల కంటే హీరోయిన్లే 10 శాతం అధికంగా కష్టపడుతున్నారంది. అయినప్పటికీ హీరోలనే ఎక్కువగా మోస్తున్నారని అభిప్రాయపడింది. అలా చేస్తే హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలని జ్యోతిక ప్రశ్నించింది.
చదవండి: ప్రియాంకని ఏడిపించేసిన బిగ్‌బాస్.. ఒక్కటైపోయిన అర్జున్-యావర్!
Comments
Please login to add a commentAdd a comment