
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది.

ఏడేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట ముంబయిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

ఈ విషయాన్ని సోనాక్షి తన అభిమానులతో పంచుకున్నారు. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా సోనాక్షిని చేతిని ఇక్బాల్ ముద్దాడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు, సినీతారలు సోనాక్షికి అభినందనలు చెబుతున్నారు.


















