
అమ్మాయిలకు తరచూ ఎదురయ్యే ప్రశ్న పెళ్లెప్పుడు?. అందులోనూ సెలబ్రిటీలు ఎవరితోనైనా క్లోజ్‌గా కనిపించారంటే చాలు త్వరలోనే సదరు హీరోయిన్ పెళ్లి అంటూ కథనాలు రాసేస్తుంటారు. అంతేకాదు కథానాయికను సైతం పదేపదే ఇదే ప్రశ్న అడుగుతూ విసిగిస్తుంటారు. ఇదే విషయంలో దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ చిర్రెత్తిపోయింది. అసలూ లేదు, కొసరూ లేదు.. అప్పుడే పెళ్లంటున్నారేంటని విరుచుకుపడింది. ఇంట్లో వాళ్ల కన్నా జనాలకే తన పెళ్లి మీద ఎక్కువ ఆసక్తి ఉందని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతానికి తన జీవితాన్ని ప్రపంచానితో పంచుకునేందుకు రెడీగా లేనని తెలిపింది. తానెప్పుడూ సినిమాల గురించే మాట్లాడినా, ఎదుటివారు మాత్రం వ్యక్తిగత విషయాలనే ఆరా తీస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పైగా అక్కడితో ఆగకుండా ఎవరికి వారే ఏదేదో ఊహించుకుని ఇష్టమొచ్చిన రూమర్లు వ్యాప్తి చేస్తారని చెప్పుకొచ్చింది. కాగా సోనాక్షి ప్రస్తుతం కాకుడ, దహడ్(ఓటీటీ డెబ్యూ) సినిమాలతో బిజీగా ఉంది.
చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి, వెడ్డింగ్ ఫొటోలపై ఫ్యాన్స్ అసంతృప్తి!
ఆ వేటను లైఫ్‌లో మరచిపోలేనంటున్న హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment