నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి | Sonakshi Reply To Trolls: For Not Donating To Covid 19 Fund | Sakshi
Sakshi News home page

నెటిజన్ల ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన సోనాక్షి

Published Wed, Apr 1 2020 12:40 PM | Last Updated on Wed, Apr 1 2020 1:29 PM

Sonakshi Reply To Trolls: For Not Donating To Covid 19 Fund - Sakshi

ముంబై : భారత్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1600కు పైగా చేరుకోగా, 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కరోనా సంక్షోభంలో చిక్కకున్న భారత్‌ను ఆదుకునేందుకు సెలబ్రిటీలు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. రాజకీయ, వ్యాపార, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు అందజేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి విరాళాన్ని ప్రకటించలేదని.. నెటిజన్లు సోనాక్షిని టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడుతున్నారు. (హలో! ఇప్పుడే క్లారిటీకి రాకండి: పూజా హెగ్డే)

సోనాక్షి కోస్టార్స్‌ అందరూ పీఎం సహాయనిధికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తూంటే.. ఆమె మాత్రం అసలు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన సోనాక్షి నెటిజన్ల ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘ కొంతమంది మంచి పని చేసి చెప్పుకుంటారు. మరికొంత మంది చెప్పుకోడానికి ఇష్టపడరు. నేను రెండో సిద్ధాంతాన్ని పాటిస్తాను. నన్ను ట్రోల్స్‌ చేసే వారికి ఒక నిమిషం మౌనం పాటిస్తున్నా. ఆపద సమయంలో ఇలాంటి ట్రోల్స్‌ చేయడం కంటే.. మీ సమయాన్ని మంచి పని చేయడం కోసం ఉపయోగించండి. విరాళం ప్రకటించడం అనే అంశం నా వ్యతిగత విషయం.’’ అంటూ బదులిచ్చారు. అయితే దీనికంటే ముందు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై  స్పందించిన అమితాబ్‌.. ట్విటర్‌ ద్వారా తనపై వచ్చిన ట్రోల్స్‌ను తిప్పికొట్టారు. (అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement