
సోనాక్షీ సిన్హా
వయసులో ఉన్నవాళ్లను ఉద్దేశించి పడిపోయారు అంటే.. ప్రేమలో పడ్డారేమో అనుకోవడం సహజం. సోనాక్షీ సిన్హా పడిపోయారు. అయితే ప్రేమలో కాదు.. వెబ్ సిరీస్‌లో పడ్డారు. ‘ఫాలెన్’ (పడిపోయారు) పేరుతో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారామె. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా.. ఇలా స్టార్ హీరోయిన్లందరూ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఫాలెన్’తో సోనాక్షీ కూడా వీరి జాబితాలో చేరిపోయారు. క్రీడా నేపథ్యంలో అక్షయ్‌కుమార్‌తో ‘గోల్డ్’ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన లేడీ డైరెక్టర్ రీమా కగ్తి ఈ వెబ్ సిరీస్‌కి దర్శకురాలు. వచ్చే నెలలో ఈ థ్రిల్లర్ చిత్రీకరణ ఆరంభం కానుంది. వెబ్ సిరీస్ చేయడం థ్రిల్‌గా ఉందన్నారు సోనాక్షీ.
Comments
Please login to add a commentAdd a comment