మహేష్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ | Mahesh Babu to Romance Sonakshi Sinha | Sakshi
Sakshi News home page

మహేష్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ

Published Tue, Mar 12 2019 1:40 PM | Last Updated on Tue, Mar 12 2019 4:57 PM

Mahesh Babu to Romance Sonakshi Sinha - Sakshi

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు త్వరలో యువ దర్శకుడు అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి సినిమాను పట్టాలెక్కించే ఆలోచన ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా చాలా మంది తారల పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

ముందుగా మహేష్‌కు జోడిగా సాయి పల్లవి నటిస్తుందన్న టాక్‌ వినిపించింది, తరువాత రష్మిక పేరు తెర మీదకు వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారన్న వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. మహేష్‌ సరసన హీరోయిన్‌గా సోనాక్షి సిన్హాను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట అనిల్ రావిపూడి. గతంలో క్రిష్ దర్శకత్వంలో మహేష్‌, సోనాక్షిలు హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందనుందటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మరి అనిల్‌ సినిమాతో అయిన ఈ జంట అభిమానులను అలరిస్తుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement