
కరోనాకు ముందు సెలబ్రిటీలు క్షణం తీరిక లేకుండా షూటింగ్‌ల వెంట తిరిగేవారు. పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా పట్టించుకునే వారే కాదు. కానీ కరోనా వచ్చాక విధించిన లాక్‌డౌన్‌ల వల్ల వారికి బోలెడంత టైం దొరికింది. ఇంకే.. ఇదే అదను అనుకున్న ఎంతోమంది తారలు బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసి పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ పెళ్లి ఊసెత్తట్లేదు. ఈ క్రమంలో ఓ నెటిజన్ బాలీవుడ్ తార సోనాక్షి సిన్హాకు పెళ్లి చేసుకోమని ఉచిత సలహా ఇవ్వగా ఆమె దానికి వ్యంగ్యంగా బదులిచ్చింది.
సోనాక్షి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అందులో ఓ నెటిజన్ 'సోనాక్షి మేడమ్.. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీవంతు ఎప్పుడొస్తుందో?' అని ప్రశ్నించాడు. దీనికి హీరోయిన్ తనదైన స్టైల్‌లో ఆన్సరిచ్చింది. 'అందరికీ కోవిడ్ వస్తోంది. నాక్కూడా రావాలా? ఏంటి?' అని కౌంటరిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment