
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. మనసారా ప్రేమించిన జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ఇరుకుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం(జూన్ 23న) ఈ రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఈ పెళ్లి సింపుల్‌గా చేసినా రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించారు.
సోనాక్షి హంగూఆర్భాటాలకు వెళ్లకుండా తల్లి పెళ్లినాటి చికంకారీ చీరను, నగలను తన వివాహానికి ధరించింది. అమ్మ పెళ్లి చీరలో మెరిసిన ఈ బ్యూటీ రిసెప్షన్‌కు మాత్రం సింధూరం రంగులో ఉన్న బనారస్ పట్టు చీరను ఎంచుకుంది.
చాంద్ బుట్టా, జరీ బార్డర్ చీరకే ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఈ ఎర్ర చీర ఖరీదు రూ.79,800 అని తెలుస్తోంది. ఈ చీరకు మ్యాచింగ్‌గా మామూలు రెడ్ జాకెట్ ధరించింది. జడ కొప్పు వేసుకుని మల్లెపూలు పెట్టుకుంది. నుదుటన సింధూరంతో సోనాక్షి ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. రిసెప్షన్‌లో భర్తతో కలిసి డ్యాన్స్ చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: పవన్‌తో భేటీ కానున్న టాలీవుడ్ నిర్మాతలు.. అది అసలు విషయం
Comments
Please login to add a commentAdd a comment