
‘‘మీ అమ్మా, నాన్నా (శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హా,) ఇటీవలే సొదరుడు (లవ్ సిన్హా) కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మీక్కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా?’’ అనే ప్రశ్నను సోనాక్షీ సిన్హా ముందుంచింతే –‘‘నాకలాంటి ఆలోచనలు ఏమీ లేవు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘అన్నయ్య రాజకీయాల్లోకి వెళ్లడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే తనకు రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. ఫలితం మేం అనుకున్న విధంగా రాలేదు. అయినా తన ప్రయత్నం తను చేశాడు. అలానే రాజకీయాల్లోకి యువత ఇంకా ఎక్కువ మంది రావాలి’’ అన్నారు సోనాక్షి. కొత్త సంవత్సరం వేడుకల గురించి చెబుతూ – ‘‘కొత్త సంవత్సరాన్ని విదేశాలకు వెళ్లి చేసుకోవడం నాకు అలవాటు. కానీ ఈసారి న్యూ ఇయర్‌కి హాలిడే లేదు. కోవిడ్ వల్ల చాలా రోజులు షూటింగ్స్ ఆగిపోయాయి. నా డిజిటల్ షో చిత్రీకరణతో బిజీగా ఉంటాను. న్యూ ఇయర్ రోజు మాత్రం దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లి వెంటనే వచ్చేయాలనుకుంటున్నాను’’ అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment