'దబాంగ్' బ్యూటీ సోనాక్షి సిన్హా సింగిల్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. సోనాక్షి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆమె వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ మురిసిపోయింది. అంతేకాదు ఓ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది. 'ఇది నాకు బిగ్ డే.. ఈరోజు నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది, దాన్ని మీతో పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను' అని రాసుకొచ్చింది.
ఇక ఇది చూసిన ఫ్యాన్స్ కచ్చితంగా ఆమె తన పెళ్లివార్తను చెప్పబోతుందంటూ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వేలికి రింగ్‌తో పాటు తన పక్కనున్న వ్యక్తిని క్రాప్ చేసిందంటే అతడు కచ్చితంగా సోనాక్షికి కాబోయేవాడని కామెంట్లు చేస్తున్నారు. కానీ కొద్దిమంది మాత్రం ఇదేదో ప్రమోషనల్ స్టంట్ అయ్యుంటుందిలే అని తేలికగా తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే జహీర్ ఇక్బాల్, సోనాక్షి డేటింగ్ చేసుకుంటున్నారంటూ గతకొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! దీనిపై రెండురోజుల క్రితమే జహీర్ స్పందిస్తూ.. మీరేమనుకున్నా నేను పట్టించుకోను. నేను ఆమెతో ఉండటం మీకు సంతోషాన్ని కలిగిస్తే ఆనందించండి, లేదంటే దానికోసం ఆలోచించడమే మానేయండి, కానీ నేను మాత్రం ఈ విషయాన్నసలు పట్టించుకోను అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment