‘మీమ్స్‌ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’  | Sonakshi Sinha Counter To Trolls Over Ramayan Question | Sakshi
Sakshi News home page

‘మీమ్స్‌ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’ 

Published Mon, Sep 23 2019 8:02 PM | Last Updated on Mon, Sep 23 2019 8:02 PM

Sonakshi Sinha Counter To Trolls Over Ramayan Question - Sakshi

ఎవరైనా పని లేని వాళ్లు ఉంటే తన మీద మరిన్ని మీమ్స్‌ సృష్టించాలని కోరుతున్నారు బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా. మీమ్స్‌ను పిచ్చిగా ప్రేమిస్తానని...తన మీద జోకులు వేయడాన్ని ఆస్వాదిస్తానని పేర్కొన్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. అమితాబ్‌ హోస్ట్‌గా నిర్వహిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో సోనాక్షి ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాట్‌సీట్‌లో కూర్చున్న సోనాక్షికి బిగ్‌ బీ...ఎవరికోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు? అని ప్రశ్న సంధించాడు. ఇందుకు.. ఏ. సుగ్రీవుడు, బి.లక్ష్మణుడు, సీ. సీత, డీ. రాముడు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు కూడా.

అయితే సోనాక్షి మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకున్నారు. ఇక అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. వీటిపై హుందాగా స్పందించిన.. ‘ప్రియమైన ట్రోల్స్‌...నాకు పైథాగరస్‌ సిద్ధాంతం, మర్చంట్‌ ఆఫ్ వెనిస్‌, పిరియాడిక్‌ టేబుల్‌, మొఘల్‌ వంశం.. ఇంకా చాలా చాలా గుర్తుకులేవు. అసలు గుర్తులేని విషయాలేంటో కూడా మర్చిపోయాను. మీకు పనేమీ లేకపోతే..ఈ విషయలాన్నింటిపై మీమ్స్‌ సృష్టించండి. ఐ లవ్‌ మీమ్స్‌ అంటూ ఘాటు సమాధానమిచ్చారు. ఈ ట్వీట్‌పై స్పందించిన సోనాక్షి అభిమానులు..భలే కౌంటర్‌ ఇచ్చారు మేడమ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement