అబ్బే అదేం లేదు | Sonakshi Sinha denies being in a relationship with Zaheer Iqbal | Sakshi
Sakshi News home page

అబ్బే అదేం లేదు

Published Thu, Jan 10 2019 2:06 AM | Last Updated on Thu, Jan 10 2019 2:06 AM

Sonakshi Sinha denies being in a relationship with Zaheer Iqbal - Sakshi

సోనాక్షి సిన్హా

.. అంటున్నారు బాలీవుడ్‌ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఏ వార్తను ఇలా కొట్టిపారేస్తున్నారంటే.. బాలీవుడ్‌ యంగ్‌ హీరో జహీర్‌ ఇక్బాల్‌తో తాను లవ్‌లో ఉన్నాననే విషయాన్ని. 2018 సోనాక్షికి వృత్తి రీత్యా సరిగ్గా కలసి రాలేదు. వ్యక్తిగతంగా మాత్రం ఈ యంగ్‌ హీరోతో ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్‌ మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఇంతకీ జహీర్‌ ఇక్బాల్‌ ఎవరంటే.. త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానున్న హీరో. సల్మాన్‌ ఖాన్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘నోట్‌బుక్‌’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు.

జహీర్, సోనాక్షీ కలవడానికి కారణం కూడా సల్మాన్‌ఖానే అని టాక్‌.  రీసెంట్‌గా జరిగిన సల్మాన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో జహీర్‌తో కలసి పార్టీకు కూడా హాజరు అయ్యారట సోనాక్షి. అయితే ఈ వార్తలను సోనాక్షి కొట్టిపారేశారు. ‘మేం రిలేషన్‌లో లేము. మా ఇద్దరి మధ్యలో రొమాన్స్‌ ఏం లేదు’ అని సమాధానమిచ్చారు. మరి ఏమీ లేకుండా కలిసి ఎందుకు తిరుగుతున్నట్లబ్బా? అని కొందరి సందేహం. ఆ సంగతలా ఉంచి, సినిమాల విషయానికి వస్తే సోనాక్షి ‘ కళంక్‌’ అనే పీరియాడికల్‌ చిత్రంలో నటించారు. జహీర్‌ ‘నోట్‌బుక్‌’ చిత్రం మార్చిలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement