బాలీవుడ్‌ బ్యూటీ పెళ్లి.. సొంత అన్నయ్యలే గైర్హాజరు.. ఇష్టం లేదనే! | Sonakshi Sinha Brothers Luv Sinha And Kush Sinha Did Not Attend Heroine Wedding | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ హీరోయిన్‌ పెళ్లికి డుమ్మా కొట్టిన అన్నలు.. ఆ కారణం వల్లే!

Published Mon, Jun 24 2024 5:59 PM | Last Updated on Mon, Jun 24 2024 6:14 PM

Sonakshi Sinha Brothers Luv Sinha, Kush Sinha Not Attend Heroine wedding

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హ పెళ్లికూతురిగా ముస్తాబయింది. చేతికి ఎర్రగా పండిన గోరింటాకు, ఎర్రటి పట్టుచీర, చీరకు తగ్గట్లుగా రెడ్‌ బ్యాంగిల్స్‌.. సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఎంతో అందంగా రెడీ అయింది. ఏడేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న జహీర్‌ ఇక్బాల్‌ను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంది. ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే తన పెళ్లికి సోనాక్షి అన్నలిద్దరూ హాజరవలేదు. లవ్‌ సిన్హా, ఖుష్‌ సిన్హా ఎక్కడని అంతా ఆరా తీశారు. కానీ సమాధానం దొరకలేదు. చెల్లి పెళ్లిని ముందుండి జరిపించాల్సిన వారు కనిపించకుండా పోవడమేంటని అతిథులు సైతం ఆశ్చర్యపోయారు.

పెళ్లికి డుమ్మా
సోనాక్షి పెళ్లికి తన పేరెంట్స్‌ హాజరయ్యారు కానీ ఆమె సోదరులిద్దరూ అటు వివాహానికి, ఇటు రిసెప్షన్‌కు దేనికీ హాజరవలేదని తెలుస్తోంది. వ్యాపారి ఇక్బాల్‌ రతాన్సీ కుమారుడు జహీర్‌ను సోనాక్షి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆమె అన్నలిద్దరూ ఈ కార్యక్రమానికి రాలేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి లవ్‌ సిన్హాకు ప్రశ్నలు ఎదురవగా అతడు ఇలా స్పందించాడు. ఒక రెండు రోజులు సమయం ఇవ్వండి. నాకు బదులివ్వాలని అనిపిస్తే అప్పుడు మీరడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని దాటవేశాడు.

మీ అన్నయ్యలెక్కడ?
కాగా పెళ్లికూతురి సోదరుడు చేయాల్సిన కొన్న పనులను సోనాక్షి స్నేహితుడు, నటుడు సఖీబ్‌ సలీమ్‌ తన భుజాన వేసుకున్నాడు. ఆమెను మండపానికి తీసుకొచ్చేటప్పుడు పూల చద్దర్‌ను సఖీబ్‌ పట్టుకుని నడిచాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. అదేంటి నీకు ఇద్దరన్నలు ఉన్నారు.. వాళ్లు ఎక్కడా కనిపించడం లేదేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

 

చదవండి: కల్కి 2898 ఏడీ.. కారులో కూర్చొని సినిమా చూసేయొచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement