ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఆ పేరే వినిపిస్తోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆ సినిమా కోసమే ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అదే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. దీంతో ఈ చిత్రంపై పాన్ ఇండియాతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే కల్కి సినిమాకు సంబంధించి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మూవీ టికెట్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ముంబయిలో కల్కి సినిమా టికెట్ ధరలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ముంబయిలోని మల్టీప్లెక్స్‌లో కల్కి టికెట్ ధర ఏకంగా రూ.2000 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబయి నగరంలోని మైసన్ పీవీఆర్: జియో వరల్డ్ డ్రైవ్-ఇన్ మల్టీప్లెక్స్‌లో ఈ ధరను నిర్ణయించారు. అయితే ప్రత్యేక డ్రైవ్-ఇన్ థియేటర్లో ప్రేక్షకులు తమ సొంత స్నాక్స్‌తో పాటు తమ కారులోనే కూర్చొని సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు. ముంబయిలో రెండో అత్యంత ఖరీదైన టిక్కెట్ ఐనాక్స్: ఇన్సిగ్నియాలో వర్లీస్ అట్రియా మాల్‌లో రాత్రి 9:30 గంటలకు షో టిక్కెట్ ధర రూ.1,760 గా నిర్ణయించారు. దీంతో కల్కి టికెట్ ధరలు చూసిన అభిమానులు ఇది ప్రభాస్ రేంజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఇంత ధర వెచ్చించి సినిమా చూడాలా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. కల్కి మూవీ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment