
ఆ టూర్ ముందు అనుకున్నదే: ఆనంద్ శర్మ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి రాజనీతిజ్ఞుడని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కితాబు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తప్పుబట్టారు. పాక్ పర్యటన ప్రధానమంత్రి ముందు నుంచి అనుకున్నదే తప్ప.. అప్పటికప్పుడు అనుకుని చేసినది కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రం మోదీ ఈ పని చేయలేదని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి రాకముందు పాక్ పేరెత్తితేనే ఒంటికాలి మీద లేచేదని, అప్పట్లో అర్ధవంతమైన చర్చలు జరగకుండా అడ్డుకుందని ఆనంద్ శర్మ ఆరోపించారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వంతో సత్సంబంధాలున్న ఓ వ్యాపారవేత్త కూడా నవాజ్ షరీఫ్ వెంట ఉన్నారని, అలాంటప్పుడు ప్రధాని పర్యటన అప్పటికప్పుడు అనుకున్నదని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.