
'ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి'
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.
ముంబై: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. వంద రోజుల పాలన పూర్తిచేసుకున్న మోదీ.. ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు.
అరచేతిలో స్వర్గం చూపించి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. మంచి రోజులు వస్తాయని ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. మోదీకి, ఆయన ప్రభుత్వానికి మాత్రమే మంచి రోజులు వచ్చాయని చెప్పారు. ప్రజల స్థితిగతులు ఏమీ మారలేదని ఆనంద్ శర్మ అన్నారు.