
కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ
న్యూఢిల్లీ: యుపిఏ మళ్లీ అధికారంలోకి వస్తే ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే ప్రధాని అని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ చెప్పారు. తాను వారణాసి నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బిజెపి సిట్టింగ్ ఎంపి మురళీమనోహర్ జోషి మోడీ కోసం ఈ స్థానాన్ని వదులుకున్నారు. ఆయన ప్రస్తుతం కాన్పూరు నుంచి పోటీ చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆనంద్ శర్మ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. మతపరంగా హిందువులకు ఎంతో ముఖ్యమైన ఈ స్థానం నుంచి బ్రాహ్మణ నేత అయిన ఆనంద్ శర్మను నిలిపితే గట్టి పోటీ ఇవ్వగలరని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా వారణాసి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు.
-------------------------------------------------------