‘బిగ్‌బాస్ షో’లోని సన్నివేశాలపై అభ్యంతరం
అలంపూర్ రూరల్: ఒక టీవీ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని బ్రాహ్మణ సంఘాల బాధ్యులు డిమాండ్ చేస్తున్నారు. హోమగుండం వద్ద బ్రష్ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా.. అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు సరికాదని పేర్కొన్నారు.
ఆయా సన్నివేశాలను తొలగించి క్షమాపణ చెప్పాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి ప్రధాన కార్యదర్శి శ్రీకొండుమాకాంత్ శర్మ సిద్ధాంతి, బ్రాహ్మణ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌శర్మ తదితరులు డిమాండ్ చేశారు.