మోదీ ఆ అంశాన్ని ఇప్పుడెందుకు ప్రస్తావించారు?
- సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఏడాది అవుతోంది
- ఆ తర్వాత కూడా దాడులు జరిగాయి
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్ర్యం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏడాది కింద జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రధాని మోదీ ఇప్పుడెందుకు ప్రస్తావించారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. పాక్‌లోని ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత కూడా ఉగ్రవాద దాడులు, సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గుర్తుచేశారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చాలా గొప్పదని ప్రధాని మోదీ చెప్తున్నారని, కానీ ఇదే బీజేపీ విపక్షంలో ఉన్నప్పుడు జీఎస్టీని ఏడేళ్లపాటు అడ్డుకున్నదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి.. రాజ్యాంగసవరణ జరిగేలా చూశాయని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ విస్మరించారని విమర్శించారు. చాలా ఆషామాషీగా ప్రధాని మోదీ గోరఖపూర్ విషాదాన్ని ప్రకృతి వైపరీత్యాలతో పోల్చారని మండిపడ్డారు.