
'బీజేపీ నేతల ప్రకటనలు అవమానకరం'
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించడంలో ఆయన వైఫల్యం కొట్టిచ్చినట్టు కనబడుతోందని అన్నారు.
విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలు దద్దరిల్లుతున్నా ప్రధాని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేములపై బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు అభ్యంతరకరం, అవమానకరం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
కాగా, జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాము ప్రయత్నించడం లేదని ఆయన తెలిపారు. బీజేపీ, పీడీపీ సంకీర్ణం ఏం చేస్తుందోనని ఎదురు చూస్తున్నామని చెప్పారు.